గొగొయికు పదవీ విరమణ అనంతరం జెడ్‌ప్లస్ భద్రత కొనసాగింపు !

Ranjan Gogoi
x
Ranjan Gogoi
Highlights

రంజన్ గొగొయ్ పదవీ విరమణ చేసిన అనంతరం కూడా జెడ్ ప్లస్ సెక్యూరిటీని ప్రభుత్వం కొనసాగించనుంది.

భారత సుప్రీం కోర్డు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ శుక్రవారం ప్రత్యేకంగా తన చివరి పనిదినాన్ని ముగించుకున్నారు. రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేసిన అనంతరం కూడా జెడ్ ప్లస్ సెక్యూరిటీని ప్రభుత్వం కొనసాగించనుంది. గొగోయి తోపాటు నాలుగురు న్యాయమూర్తులకు ఈ భద్రతను కల్పిచారు. అయోధ్య తీర్పు వెల్లడించడానికి ముందే ఆయనకు తీర్పులో భాగమున్న మరో నలుగురు న్యాయమూర్తులకు జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నారు. గొగొయి చెందిన గువహటిలోని ఇంటికి కూడా భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆయనకు భద్రతను ఆసోం పోలీసులు ఇవ్వనున్నారు.

నవంబర్ 17వ తేదీన రంజన్‌ గొగోయ్‌ పదవీ కాలం ముగుస్తుంది. రంజన్‌ గొగోయ్‌ పదవీ విరమణ అనంతరం గొగోయ్ స్థానంలో మహారాష్ట్రకు చెందిన జస్టిస్‌ శరద్‌ అర్వింద్‌ బోబ్డే (63) సుప్రీం కోర్డు న్యాయముర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో రంజన్‌ గొగోయ్‌ తన ధర్మాసనంలో విచారణకు లిస్ట్‌ కేసారి నోటీసులు జారీ చేశారు

జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ అసోం రాష్ట్రాకి చెందిన వ్యక్తి. 1978లో గొగోయ్‌ బార్‌ కౌన్సిల్‌లో చేరారు. లాయర్‌గా గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్‌ చేశారు. 2001 ఫిబ్రవరి 28న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులైయ్యారు. జస్టిస్‌ గొగోయ్‌ 2012 ఏప్రిల్‌లో సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తి చెందిన పదోన్నతి పొందారు. భారత 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ కొనసాగారు.

జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ విరమణ అనంతరం జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే (63) ప్రధాన న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు చేపట్టారు. జస్టిస్‌ బోబ్డే 19 సంవత్సరాలు బాంబే హైకోర్టులో పనిచేశారు. రెండేళ్లకు మధ్యప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. తర్వాత 2013 ఏప్రిల్‌ 12న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆర్టికల్‌ 370 కేసుతోపాటు పలు కీలక కేసులు విచారణ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories