సివిల్‌ సర్వీసెస్‌ – 2018 ఫలితాలు విడుదల.. సత్తా చాటిన వరుణ్ రెడ్డి

సివిల్‌ సర్వీసెస్‌ – 2018 ఫలితాలు విడుదల.. సత్తా చాటిన వరుణ్ రెడ్డి
x
Highlights

సివిల్‌ సర్వీసెస్‌ – 2018 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) గతేడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో సివిల్స్‌...

సివిల్‌ సర్వీసెస్‌ – 2018 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) గతేడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్ష లను.. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇంట ర్వ్యూలు నిర్వహించింది. ఈ ఫలితాలు శుక్రవారం రాత్రి విడుదల చేసింది. మొత్తం 759 మంది సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. ఇందులో జనరల్‌ కేటగిరీలో 361 మంది, ఓబీసీ కేటగిరీలో 209 మంది, ఎస్సీ కేటగిరీలో 128 మంది, ఎస్టీ కేటగిరీలో 61 మంది ఎంపికయ్యారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కర్నాటి వరుణ్ రెడ్డి సివిల్స్‌లో ఆలిండియా స్థాయిలో ఏడో ర్యాంక్ సాధించారు. గతంలో 166వ ర్యాంక్ సాధించిన వరుణ్.. ప్రస్తుతం ఐఆర్ఎస్ శిక్షణలో ఉంటూనే మళ్లీ ప్రయత్నం చేసి ఏడో ర్యాంక్ సాధించి సత్తా చాటారు. వరుణ్‌రెడ్డి తల్లి పోరెడ్డి నాగమణి మిర్యాలగూడ ఏడీఎగా పని చేస్తుండగా తండ్రి కర్నాటి జనార్దన్‌రెడ్డి కంటి వైద్యనిపుణులుగా పేరుగాంచారు.

వరుణ్‌రెడ్డి చిన్ననాటి నుంచి కూడా చదువులో రాణించేవాడు. అలాగే జాతీయ స్థాయిలో అంకిత14వ ర్యాంకుల్లో నిలిచారు. అచ్చంపేటకు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ షాహిద్‌ 57వ ర్యాంకు, తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణానికి చెందిన గోకరకొండ సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌ 64వ ర్యాంకు, తిరుపతికి చెందిన మల్లారపు నవీన్‌ 75వ ర్యాంకు సాధించారు. 577 మంది పురుషులు, 182 మంది మహిళలు కలిపి మొత్తం 759 మంది ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్, సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్ ఏ, గ్రూప్ బీకి సెలెక్ట్ అయినట్లు యూపీఎస్సీ వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories