ఈనెల 7న తమిళనాడుకు చిన్నమ్మ రాక

Chinnamma arrives in Tamilnadu on the 7th of this month
x

(ఫైల్ ఇమేజ్)

Highlights

* ప్రస్తుతం బెంగళూరులో క్వారంటైన్‌లో ఉన్న శశికళ * హోసూరు నుంచి చెన్నై వరకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు

అన్నాడీఎంకే మాజీ నేత శశికళ మరో రెండు రోజుల్లో తమిళనాడు రానున్నారు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న శశికళ ఈనెల 7న తమిళనాడు వస్తారని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీడీ దినకరన్ తెలిపారు. ఎన్నికల తర్వాత అమ్మ ప్రభుత్వం ఏర్పాటులో శశికళ కీలక పాత్ర పోషించనున్నట్లు చెప్పారు. జయలిలత నిజమైన మద్దతుదారులంతా శశికళ రాక కోసం ఎదురు చూస్తున్నారన్న దినకరన్ కర్ణాటక-తమిళనాడు సరిహద్దుల్లోని హోసూరు నుంచి చెన్నై వరకు శశికళకు ఘన స్వాగతం పలకనున్నట్లు తెలిపారు.

రాబోయే ఎన్నికల్లో శశికళ పోటీ చేసే అవకాశంపై స్పందించిన దినకరన్ ప్రస్తుతానికి ఆమె ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితులు లేవన్నారు. లీగల్ పరంగా వెసులుబాటు ఉంటుందా అనే విషయంపై కసరత్తు చేస్తున్నామన్నారు. ఇక అన్నా డీఎంకే జనరల్ సెక్రటరీ పదవి నుంచి తప్పించడంపై కూడా లీగల్‌గా శశికళ పోరాడతారని క్లారిటీ ఇచ్చారు దినకరన్.

Show Full Article
Print Article
Next Story
More Stories