చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత పర్యటన

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత పర్యటన
x
Highlights

రెండు రోజుల పర్యటన కోసం భారత్‌ వస్తున్న జిన్ పింగ్ జిన్‌పింగ్‌కు చెన్నై విద్యార్థులు వినూత్న స్వాగతం జిన్‌పింగ్ మాస్క్‌లను ధరించిన కళాశాల విద్యార్థులు

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత పర్యటన మరి కొన్ని గంటల్లో ఆరంభం కాబోతోంది. రెండు రోజుల పర్యటన కోసం జిన్ పింగ్ సాయంత్రం చెన్నైకి చేరుకోనున్నారు. చైనా రాజధాని బీజింగ్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన నేరుగా చెన్నై విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి చైన్నై శివార్లలోని మామళ్లాపురం పట్టణానికి బయలుదేరి వెళ్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో రేపు ఉదయం ఇదే పట్టణంలో సమావేశమౌతారు.

తొలిసారిగా తమ రాష్ట్రానికి రానున్న జిన్ పింగ్ కు చెన్నై విద్యార్థులు వినూత్నంగా స్వాగతం పలుకుతున్నారు. చెన్నైలోని ఓ కళాశాల విద్యార్థులు జిన్ పింగ్ మాస్క్ లను ధరించారు. జిన్ పింగ్ భారీ చిత్రపటాన్ని తమ కళాశాల మైదానంలో ఆవిష్కరించారు. ఆ చిత్రపటం ముందు చైనా లిపిలో స్వాగతం పలుకుతూ ఆసీనులయ్యారు. సుమారు 2000 మందికి పైగా విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. ఏ దేశాధ్యక్షుడైనా సరే.. తమ రాష్ట్రానికి తొలిసారిగా రాబోతుండటం పట్ల ఆనందంగా ఉందని, పైగా ఆసియాలో అత్యంత శక్తిమంతమైన చైనా దేశాధ్యక్షుడే రాబోతుండటం గర్వకారణంగా ఉందని విద్యార్థులు వ్యాఖ్యానిస్తున్నారు.

జిన్ పింగ్ కాన్వాయ్ వాహనాలు బుధవారమే చెన్నైకి చేరుకున్నాయి. ఆ వాహనాల్లోనే ఆయన ప్రయాణిస్తారు. సముద్రతీర ప్రాంతమైన మామళ్లాపురంలో భేటీ కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ మామళ్లాపురంలో పూర్తయ్యాయి. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. జిన్ పింగ్ సహా ఆయనతో పాటు వచ్చే అధికారుల బృందానికి అక్కడే బసను ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories