అక్కడ మొబైల్ వాడకం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న మమతా బెనర్జీ

అక్కడ మొబైల్ వాడకం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న మమతా బెనర్జీ
x
Chief Minister Mamata Banerjee
Highlights

ప్రభుత్వ ఆసుపత్రులలో మొబైల్ ఫోన్‌ల వాడకాన్ని మమతా బెనర్జీ ప్రభుత్వం నిషేధించింది.

ప్రభుత్వ ఆసుపత్రులలో మొబైల్ ఫోన్‌ల వాడకాన్ని మమతా బెనర్జీ ప్రభుత్వం నిషేధించింది. కోల్‌కతాలోని కోవిడ్ -19 ఆసుపత్రిలో చిత్రీకరించిన వీడియోను కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో షేర్ చేసిన అనంతరం ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం వెలువడింది. ఇకనుంచి కోవిడ్ ఆసుపత్రులలో మొబైల్ ఫోన్‌ వాడకాన్ని నిషేధించామని.. ఎవరూ వాడొద్దని బెంగాల్ ప్రధాన కార్యదర్శి రాజీవా సిన్హా సూచించారు. మొబైల్ ఫోన్లు అత్యంత అంటు పరికరాలని.. ఆసుపత్రుల లోపలకు వీటిని తీసుకురాకూడదని , ఈ విషయంలో ఎటువంటి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదని.. కాబట్టి వైద్యులు, ఇతర సిబ్బంది వారి మొబైల్ ఫోన్‌లను బయట జమ చేసి రావాలని సూచించారు. అయితే ఇందుకు బదులుగా ల్యాండ్‌లైన్‌లను ఉపయోగించవచ్చని చెప్పారు.

కాగా ఎంఆర్ బంగూర్ హాస్పిటల్ లోని పురుషుల వార్డ్ లోపల చిత్రీకరించిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో ఆసుపత్రిలో ఒంటరిగా ఉంచిన రోగిని చిత్రీకరించారు. ఇక్కడ ఐసోలేషన్ వార్డులో రోగులతో పాటు రెండు మృతదేహాలను కూడా ఉంచినట్లు ఆ వీడియో చూపిస్తుంది. దీంతో ప్రభుత్వం దీనిపై సీరియస్ అయింది. ఈ క్రమంలోనే ఆసుపత్రులలో ఫోన్ల వాడకాన్ని నిషేధించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories