Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో 51 మంది మావోయిస్టుల లొంగుబాటు

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో 51 మంది మావోయిస్టుల లొంగుబాటు
x

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో 51 మంది మావోయిస్టుల లొంగుబాటు

Highlights

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పెద్దఎత్తున లొంగుబాటు చేశారు. నారాయణపూర్‌, సుక్మా, బీజాపూర్‌, కాంకేర్‌ జిల్లాల్లో కలిపి మొత్తం 51 మంది ఆయుధాలు విడిచిపెట్టి అధికారుల ఎదుట లొంగిపోయారు.

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పెద్దఎత్తున లొంగుబాటు చేశారు. నారాయణపూర్‌, సుక్మా, బీజాపూర్‌, కాంకేర్‌ జిల్లాల్లో కలిపి మొత్తం 51 మంది ఆయుధాలు విడిచిపెట్టి అధికారుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు వేగవంతం కావడం, ప్రభుత్వ పునరావాస విధానం సమర్థవంతంగా అమలు కావడం వల్ల నక్సల్స్‌ కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోతున్నాయని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు.

2024 నుండి ఇప్పటివరకు బీజాపూర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లలో 185 మంది మావోయిస్టులు హతమయ్యారని, 803 మంది అరెస్టయి, 431 మంది లొంగిపోయారని ఆయన పేర్కొన్నారు.

జిల్లా వారీగా లొంగుబాట్లు

బీజాపూర్: బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ ఎదుట 25 మంది లొంగిపోయారు. వీరిపై ₹1.15 కోట్ల రివార్డు ఉంది. లొంగిపోయిన వారికి ₹50 వేల చొప్పున చెక్కులు అందజేశారు.

కాంకేర్: ఎస్పీ కల్యాణ్ ఎలిసెల ఎదుట 13 మంది లొంగిపోయారు. వీరిలో మిలటరీ కంపెనీ కమాండర్ మంగులు ఉన్నాడు. వీరిపై మొత్తం ₹62 లక్షల రివార్డు ఉంది.

సుక్మా: ఎస్పీ కిరణ్ జవాన్ ఎదుట 5 మంది లొంగిపోయారు. వీరిపై ₹6 లక్షల రివార్డు ఉంది. గతంలో వీరు పలు విధ్వంసకర ఘటనల్లో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.

నారాయణపూర్: ఎస్పీ రాబిన్‌సన్ గుడియా ఎదుట 8 మంది, అందులో నలుగురు మహిళలు, లొంగిపోయారు. వీరిలో కమాండర్ కమలేశ్ ఉన్నాడు. వీరిపై ₹33 లక్షల రివార్డు ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories