ఏమండోయ్ ఇది విన్నారా..? రూ.800కే ఏసీ అట..

ఏమండోయ్ ఇది విన్నారా..? రూ.800కే ఏసీ అట..
x
Highlights

ఎండాకాలం ఉక్కపోత, ఉడుకుతో అల్లాడిపోయే ప్రజలు ఎక్కువగా ఏసీలను ఆశ్రయిస్తుంటారు. దాంతో ఏసీలకు ధరలు భారీగా పెరిగిపోయాయి. మార్కెట్లో మేలురకం ఏసీ కొనాలంటే...

ఎండాకాలం ఉక్కపోత, ఉడుకుతో అల్లాడిపోయే ప్రజలు ఎక్కువగా ఏసీలను ఆశ్రయిస్తుంటారు. దాంతో ఏసీలకు ధరలు భారీగా పెరిగిపోయాయి. మార్కెట్లో మేలురకం ఏసీ కొనాలంటే కనీసం రూ. 40 వేలైనా పెట్టాల్సి ఉంటుంది. దాంతో మధ్యతరగతి ప్రజలు తక్కువ రేట్లతో వచ్చే కూలర్లను కొంటున్నారు. ఈ క్రమంలో గుజరాత్ వడోదర ప్రాంతానికి చెందిన మనోజ్‌ పటేల్‌ అనే వ్యక్తి కేవలం.. రూ. 800 లకే ఇస్తానని చెబుతున్నాడు. అయితే అది సాధారణ ఏసీ కాదంట.. మట్టిలోని అతిసూక్ష్మ రంధ్రాల గుండా వెళ్లే నీరు ఆవిరి కావడంతో నీరు చల్లబడుతుందన్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇదే ఆలోచనతోనే మనోజ్‌ పటేల్‌ చిన్నసైజు ఏసీ తయారు చేశారు. అయితే ఇందుకోసం మట్టికి బదులుగా పింగాణీ ఉపయోగించాడు. 15 రోజులు కస్టపడి మనోజ్‌ పటేల్‌ మొత్తం మూడు మోడళ్ల ఏసీలను తయారు చేశారు. ఇందులో ఒక ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ ఉంటుంది. వాటర్ ట్యాంక్ ను నింపితే 10 రోజుల వరకు ఆ నీటినే వాడుకోవచ్చని చెప్పాడు మనోజ్. విద్యుత్‌ అవసరం లేదని చెప్తోన్న ఈ ఏసీకి గది ఉష్ణోగ్రతలను 32 డిగ్రీల నుంచి 23 డిగ్రీల స్థాయికి తీసుకు రాగల శక్తి ఉందన్నారు. ఈ ఏసీ కోసం పింగాణీ, రాళ్లు, మట్టి మాత్రమే వాడటం వల్ల ఖర్చు కేవలం రూ.800 మాత్రమేనని చెప్పాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories