Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీలో మార్పు

Change in Rahul Gandhi with Bharat Jodo Yatra
x

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీలో మార్పు

Highlights

Bharat Jodo Yatra: క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా అధ్యయనం చేసిన రాహుల్

Bharat Jodo Yatra: ఒకటే లక్ష్యం.. గమ్యం ఒక్కటే... దేశంలో కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేదనే విమర్శలకు రాహుల్ గాంధీ నిఖార్సయిన సమాధానమిచ్చారు. దేశంలో తొలిసారిగా సుధీర్ఘ పాదయాత్ర చేపట్టిన నాయకుడిగా రికార్డు నమోదు చేశారు. పాదయాత్రతో విమర్శకుల నోళ్లను మూయించారని ఆపార్టీ శ్రేణుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకుమారుడిలా పెరిగిన రాహుల్ గాంధీకి ప్రజల కష్టనష్టాలు తెలియవని, రాజకీయాలు ఏంతెలుసనే విపక్షాల విమర్శలను భారత్ జోడోయాత్ర తిప్పికొట్టగలిగిందని ఆపార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. పాదయాత్ర ఓట్లను కురిపిస్తుందా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తే... కాంగ్రెస్ పార్టీని కాపాడుకోడానికి దేశనాయకుడున్నాడని ఈ పాదయాత్ర నిరూపించిందని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

జోడో యాత్ర... దేశంలో ప్రేమ సందేశాన్ని వ్యాప్తి చేసిందని ప్రియాంకాగాంధీ ట్వీట్‌ చేశారు. ఈ రోజు చరిత్రలో గుర్తుండిపోయే రోజు. దేశపౌరుల మద్దతుతో భారత్‌ జోడో యాత్ర దిగ్విజయంగా కన్యాకుమారి నుంచి తుది గమ్యస్థానానికి చేరుకుంది. ప్రేమ సందేశం దేశమంతా వ్యాపించిందని ప్రియాంక తెలిపారు. రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రజల్లోనూ విశ్వాసం పెంపొందించింది. కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టేందుకు అర్హత సాధించిన నాయకుడిగా ఎదిగారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశాలు వచ్చినా.. పాదయాత్ర చేపట్టిన ప్రారంభ సమయంలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించి గాంధీయేతర కుటుంబానికి అప్పగించిన రాహుల్ గాంధీ రాజకీయ అనుభవంకోసం స్వతహాగా తప్పుకున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సమర్థనాయకుడు రాహుల్ గాంధీయేనని ఈ పాదయాత్రతో అర్హత సాధించారని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయం వ్యక్తంచేశాయి.

2022, సెప్టెంబరు 7 తేదీన కన్యాకుమారినుంచి ఆరంభమైన భారత్ జోడో యాత్ర ఇవాళ శ్రీనగర్‌లో జరిగి బహిరంగ సభతో ముగియనుంది. 134 రోజులపాటు 12 రాష్ట్రాల మీదుగా 4,084 కిలోమీటర్లమేర పాదయాత్రను సాగించారు. ప్రతి రాష్ట్రంలోనూ బహిరంగ సభ, అక్కడక్కడా కార్నర్ మీటింగులతో తన అభిప్రాయాలను వెల్లడించే ప్రయత్నం చేశారు. వివిధ రాష్ట్రాల్లో ఎడమొహం పెడమొహంతో ఉన్న నాయకులను ఏకతాటిపైకి తీసుకొచ్చారు. వ్యక్తిగత విభేధాలను పక్కనబెట్టి పార్టీ పటిష్టతకోసం పనిచేయాలనే సంకేతాలను జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలతో మమేకమై రాహుల్ గాంధీ ప్రత్యేక అభిమాన నాయకుడిగా ముద్రవేసుకోగలిగారు. పార్టీ శ్రేణుల్లోనూ సమరోత్సాహాన్ని పెంపొందించారు.

కన్యాకుమారినుంచి కాశ్మీర్ శ్రీనగర్ దాకా చేపట్టిన సుధీర్ఘపాదయాత్ర రాహుల్ గాంధీని నాయకుడిగా తీర్చిదిద్దింది. ఇన్నాళ్లు గాంధీ కుటుంబంనుంచి వచ్చిన వారసత్వ రాజకీయాన్ని పుణికి పుచ్చుకున్న రాహుల్ గాంధీ పాదయాత్ర పూర్తి చేసి పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా నిలిచారు. పార్టీని కాపాడుకోడానికి నిఖార్సయిన నాయకుడని నిరూపించారు. దాదాపు 4 వేల కిలోమీటర్లకు పైగా కొనసాగించిన పాదయాత్రను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విజయవంతంగా పూర్తి చేశారు. పాదయాత్ర సాగుతున్న సమయంలో తల్లి సోనియాగాంధీ, సోదరి ప్రియాంకా గాంధీ రాహుల్ పట్ల ఆత్మీయత, ఆప్యాయతలను కనబరచారు.

ఢిల్లీకేంద్రంగా సాగించే రాజకీయాలతో క్షేత్రస్థాయిలో ఏంజరుగుతోందనే విషయం తెలిసేది కాదు... భారత్ జోడోయాత్రతో అన్నివర్గాల ప్రజలతో రాహుల్ గాంధీ మమేకమయ్యారు. ఏసీగదుల్లో పెరిగిన రాహుల్ గాంధీ పాదయాత్రతో గుడారాల్లో నిద్ర, ఆరుబయట ఆకలి తీర్చుకున్న పరిస్థితులు రాహుల్ గాంధీలో పరివర్తన తీసుకొచ్చిందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. పాదయాత్ర పూర్తయిన సందర్భంగా రాహుల్ గాంధీతో కలిసి ఆయన సోదరి ప్రియాంకా గాంధీ శ్రీనగర్‌లోని చారిత్రక లాల్‌చౌక్‌లో త్రివర్ణ పతాకాన్ని రాహుల్‌ ఎగురవేశారు.

భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించానున్నారు. షేర్‌-ఎ-కశ్మీర్‌ స్టేడియంలో జరిగే బహిరంగ సభతో యాత్రకు అధికారికంగా ముగింపు పలుకుతారు. వివిధ ప్రతిపక్షాల నేతలు ఈ సభకు హాజరవుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories