కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉద్యోగుల జీతాలు, సెలవులలో మార్పులు..!

central key decision new wage code may be implemented in new financial year
x

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉద్యోగుల జీతాలు, సెలవులలో మార్పులు..!

Highlights

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉద్యోగుల జీతాలు, సెలవులలో మార్పులు..!

Central: ప్రభుత్వం త్వరలో కొత్త వేజ్ కోడ్‌ను అమలు చేయనుంది. దీనికోసం చాలా కాలంగా నిరీక్షణ కొనసాగుతోంది. నూతన ఆర్థిక సంవత్సరంలో దీన్ని అమలు చేయవచ్చని అందరు భావిస్తున్నారు. కొత్త కార్మిక చట్టాల్లో కూడా మార్పులు చేర్పులు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్‌లో కూడా కొన్ని సవరణలు చేసే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఇది ఏప్రిల్ 1, 2021 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వాల అడ్డంకి వల్ల అమలు కాలేదు. ఇప్పుడు ఈ నిబంధనను కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్రం అమలు చేయవచ్చు. అన్ని రాష్ట్రాలు కూడా తమ ముసాయిదా నిబంధనలను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇందులోభాగంగా ఉద్యోగుల జీతం, సెలవులలో మార్పులు చేర్పులు ఉంటాయి.

ఉద్యోగుల ఎర్న్డ్ లీవ్స్‌ని 240 నుంచి 300కి పెంచవచ్చు. లేబర్ కోడ్ నియమాలలో మార్పులకు సంబంధించి కార్మిక మంత్రిత్వ శాఖ, లేబర్ యూనియన్, పరిశ్రమ ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతాయి. కొత్త వేతన కోడ్ ప్రకారం.. ఉద్యోగుల జీతంలో మార్పులు చేర్పులు ఉంటాయి. వారి టేక్ హోమ్ జీతం తగ్గించవచ్చు. ఎందుకంటే వేజ్ కోడ్ చట్టం 2019 ప్రకారం.. ఉద్యోగి బేసిక్‌ జీతం కంపెనీ (CTC) ఖర్చులో 50% కంటే తక్కువ ఉండకూడదు. ప్రస్తుతం చాలా కంపెనీలు బేసిక్ శాలరీ తగ్గించి పై నుంచి ఎక్కువ అలవెన్సులు చూపించి కంపెనీ భారం తగ్గించుకుంటున్నాయి. దీనివల్ల ఉద్యోగులకు చాలా నష్టం జరుగుతుంది.

ఇప్పుడు కొత్త వేతన కోడ్‌లో అలవెన్సులు మొత్తం జీతంలో 50% మించకూడదని నిర్ణయించారు. అంటే ఒక ఉద్యోగి జీతం నెలకు రూ. 50,000 అనుకుంటే అతని బేసిక్‌ వేతనం రూ. 25,000, మిగిలిన అతని అలవెన్సులు రూ. 25,000లో రావాలి. అయితే కంపెనీలు ఇప్పుడు బేసిక్ జీతం 25-30 శాతంగా ఉంచి మిగిలిన భాగాన్ని అలవెన్స్‌లో చూపిస్తున్నాయి. ఇప్పుడు కొత్త వేతన కోడ్ ప్రకారం కంపెనీలు అలవెన్సులను తగ్గించవలసి ఉంటుంది. ఒక కంపెనీ రోజుకు 12 గంటల పని చేయలంటే వారంలో 3 రోజులు వీక్లీ ఆఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. పని గంటలు పెరిగితే పనిదినాలు కూడా 6కి బదులుగా 5 లేదా 4గా ఉంటాయి. కానీ దీని కోసం ఉద్యోగి, కంపెనీ మధ్య ఒక ఒప్పందం అవసరం.

Show Full Article
Print Article
Next Story
More Stories