ఇంటి యజమానులకు కేంద్ర హోంశాఖ హెచ్చరిక... అద్దె అడిగారో ఇక అంతే

ఇంటి యజమానులకు కేంద్ర హోంశాఖ హెచ్చరిక... అద్దె అడిగారో ఇక అంతే
x
Representational Image
Highlights

కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో మొత్తం వ్యవస్థలు స్తంభించిపోయాయి.

కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో మొత్తం వ్యవస్థలు స్తంభించిపోయాయి. నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీంతో దేశంలోని చాలా రాష్ట్రాల్లో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందో తెలియని స్థితి. ఈ క్రమంలో నెలాఖరు ఇంటి అద్దెలు ఎలా అనే భయం కూడా ప్రజల్లో మొదలైంది. ఈ క్రమంలో పలు స్పష్టమైన ఆదేశాలు కేంద్ర హోంశాఖ జారీ చేసింది.


అద్దె నివాసాల్లో ఉండే వలసకూలీలు, అద్దె కోసం భూ యజమానులు ఓ నెల రోజుల పాటు ఒత్తిడి చేయవద్దని స్పష్టంచేసింది. ఎవరైనా ఇంటి యజమానులు కూలీలు, విద్యార్థులను అద్దె కోసం ఒత్తిడి తెస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల హైదరాబాద్‌లో ఓ ఇంటి యజమాని పెద్దమనసు చేసుకున్నాడు. హైదరాబాద్ జీడిమెట్లలోని ఓ ఇంటి యజమాని, తన ఇంట్లో అద్దెకు ఉంటున్న నాలుగు కుటుంబాలకు కరోనా వైరస్ తగ్గే వరకు అద్దె కట్టాల్సిన అవసరం లేదని చెప్పుడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories