అక్టోబర్ 13లోగా మహారాష్ట్రలో ఆక్సిజన్, ఐసియు పడకలు పెంచాలి : కేంద్రం

అక్టోబర్ 13లోగా మహారాష్ట్రలో ఆక్సిజన్, ఐసియు పడకలు పెంచాలి : కేంద్రం
x
Highlights

మహారాష్ట్రలో వేగంగా పెరుగుతున్న కరోనా కేసుల గురించి కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. వచ్చే నెల అక్టోబర్ 13 నాటికి రోగుల సంఖ్యను..

మహారాష్ట్రలో వేగంగా పెరుగుతున్న కరోనా కేసుల గురించి కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. వచ్చే నెల అక్టోబర్ 13 నాటికి రోగుల సంఖ్యను అంచనా వేసి రాష్ట్ర ఆసుపత్రులలో ఆక్సిజన్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, వెంటిలేటర్ పడకల సంఖ్యను 7,355 కు పెంచాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సూచనలు చేసింది. రాబోయే నెలల్లో పెరుగుతున్న రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాట్లు చేయకపోతే ఇబ్బందిపడవల్సి ఉంటుందని, మరణాల సంఖ్య కూడా పెరుగుతుందని ఆరోగ్య శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

అక్టోబర్ 13 నాటికి రాష్ట్రంలో ఎంత మంది కరోనా రోగులను చేర్చుకుంటారో, ఇంకా ఎన్ని ఆక్సిజన్ పడకలు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, వెంటిలేటర్లు అవసరమవుతాయో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన సూచనలు ఇచ్చింది. ప్రతి జిల్లాలో ప్రస్తుత కరోనా రోగుల సంఖ్యను లెక్కించడం తోపాటు, అక్టోబర్ 13 వచ్చే రోగుల రోగుల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం అంచనా వేసి.. ఈ సూచన చేసింది. అలాగే రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను పెద్దఎత్తున పెంచాలని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది.

మహారాష్ట్రలో పరీక్షల సంఖ్య దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే చాలా తక్కువగా ఉందని లక్ష మందికి ప్రతిరోజూ 383 పరీక్షలు మాత్రమే జరుగుతున్నాయి. మహారాష్ట్రలో, గత వారంరోజులుగా ప్రతిరోజూ కరోనా రోగుల సంఖ్య 20,000 నుండి 24,000 వరకూ పెరుగుతూ వస్తోంది. ఇక రాష్ట్రంలో రోగుల సంఖ్య 12 లక్షల 47 వేల 284 మందికి కరోనా నిర్ధారణ కాగా.. ఇప్పటివరకు 33 వేల 407 మంది రోగులు మరణించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories