Central Government New Rules : వాహనదారులకు కేంద్రం కొత్త నిబంధనలు

Central Government New Rules : వాహనదారులకు కేంద్రం కొత్త నిబంధనలు
x
Highlights

Central Government New Rules : వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్క వాహనదారుడు తప్పని...

Central Government New Rules : వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్క వాహనదారుడు తప్పని సరిగా వారి వారి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్ అప్ డేట్ చేయవలసిందే. వాహనదారుల వాహనానికి ఆర్సీ బుక్ ఉన్నప్పటికీ, అలాగే వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్స్ లో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ అప్ డేట్ చేసుకోవల్సిందే. అసలు ఈ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్ లకు మళ్లీ కొత్తగా అప్ డేట్ చేయడం ఏంటి అనుకోవచ్చు. అది ఏంటంటే అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా నిబంధనలు కేంద్రప్రభుత్వం పలు మార్పులు చేస్తోంది. దీని ప్రకారం మీమీ వాహనాల రిజిస్ట్రేషన్ కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్స్ లకు పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందుకే ప్రతి వాహనదారుడు తమ డ్రైవింగ్ లైసెన్సులను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్పులు చేసిన కొత్త నిబంధనలు కూడా అక్టోబర్ 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా అమలులోకి వస్తున్నాయి.

కొత్తగా జారీ చేసే డ్రైవింగ్ లైసెన్సు లకు మైక్రోచిప్ ఉంటుంది. క్యూఆర్ కోడ్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్లు కూడా ఉంటాయి. అంతే కాదు యూనిఫాం వెహికిల్స్ రిజిస్ట్రేషన్ కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయనున్నారు. ఇక ఆర్సీల విషయంలో అక్టోబర్ 1 నుంచి ఈ ప్రక్రియను కాగితాన్ని ఉపయోగించకుండా చేయాలని నిర్ణయించుకుంది. అదే విధంగా సెంట్రలైజ్ చేసిన ఈ డేటా పదేళ్ల వరకు ప్రభుత్వం దగ్గర ఉంటుంది. కొత్త ఆర్సీకి యజమాని పేరు ముందు భాగంలో ఉంటుంది. వెనుకభాగంలో మైక్రోచిప్, క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ డేటా సహాయంతో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవ్యక్తులకు పెనాల్టీ వేయడం, రికార్డులను నిర్వహించడం ప్రభుత్వానికి సులభమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories