India: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Central government Key decision
x

సెంట్రల్ గవర్నమెంట్  (ఫైల్ ఇమేజ్)

Highlights

India:60 ఏళ్లు పైబడిన వారికి * అనారోగ్య సమస్యలున్న 45ఏళ్లు దాటిన వారికి టీకా

India: తగ్గినట్లే తగ్గిన కరోనా మళ్లీ విజృంభిస్తోంది. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకతోపాటు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కేసుల సంఖ‌్య గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కల్గిస్తోంది. తెలంగాణలో కొవిడ్‌ అదుపులోనే ఉన్నా.. కొద్దిరోజులుగా కరీంనగర్‌, జగిత్యాల హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో కేసుల పెరుగుదల కనిపిస్తోంది. అజాగ్రత్త ఇలాగే కొనసాగితే తెలంగాణలోనూ తిరిగి కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

దేశవ్యాప్తంగా కొత్తగా 13వేలకుపైగా మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ‌్య లక్షా 10వేలకు చేరింది. వీరిలో లక్షా 7వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు లక్షా 46వేలకుపైగా ఉన్నాయి. రికవరీ రేటు 97.25శాతం ఉండగా.. మొత్తం మరణాల సంఖ్య లక్షా 56వేలకుపైగా చేరింది.

మాస్క్‌లు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇక తెలంగాణలో వైరస్‌ అదుపులోనే కొనసాగాలంటే ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాల్సిదేనంటున్నారు వైద్యులు. ఇదిలా ఉండగా కరోనా బారిన పడి ఒక్కరోజే 100 మంది మృతిచెందారు. ఇక కేసుల విజృంభణ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్‌ రాకపోకలపై ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ కరోనా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో మార్చి ఒకటి నుంచి దేశవ్యాప్తంగా 60 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 45ఏళ్లు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్‌ ఇవ్వాలని తీర్మానించింది.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా, ప్రైవేటు కేంద్రాల్లో డబ్బుకు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు అధికారులు. ఇందుకుగాను 10వేల ప్రభుత్వ కేంద్రాలు, 20వేల ప్రైవేటు కేంద్రాల్లో టీకా కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రభుత్వమే టీకాలను కొనుగోలు చేసి ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేస్తుందని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories