జూన్ 8 నుంచి షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, ఓపెన్..ఈ కొత్త రూల్స్ తప్పనిసరి

జూన్ 8 నుంచి షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, ఓపెన్..ఈ కొత్త రూల్స్ తప్పనిసరి
x
Highlights

లాక్ డౌన్ ఐదో దశను ప్రకటిస్తూ కేంద్రం మినహాయింపులు ఇచ్చింది. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం జూన్ 8వ తేదీ నుంచి షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, ఆలయాలు, ప్రార్థనామందిరాలను తేరిసేందుకు అనుమతులు ఇచ్చింది.

లాక్ డౌన్ ఐదో దశను ప్రకటిస్తూ కేంద్రం మినహాయింపులు ఇచ్చింది. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం జూన్ 8వ తేదీ నుంచి షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, ఆలయాలు, ప్రార్థనామందిరాలను తేరిసేందుకు అనుమతులు ఇచ్చింది.అయితే వీటికి అప్పట్లోనే కేంద్రం కొన్ని నిబంధనలు విధించింది. గురువారం మరికొన్ని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దేవాలయాల్లో దేవుని విగ్రహాలను తాకకూడదని స్పష్టం చేసింది.

కేంద్ర హోంశాఖ గైడ్ లైన్స్

♦ భౌతిక దూరం అన్నిచోట్లా పాటించాలి. ఒకరి నుంచి మరొకరికి కనీసం 6 అడుగుల దూరం ఉండాలి.

♦ ముఖానికి మాస్క్‌లు, ఫేస్ కవర్లు వినియోగం తప్పనిసరి.

♦ తరచుగా సబ్బులు కనీసం 40 సెకన్ల నుంచి 60 సెకన్ల వరకు చేతులు కడుక్కోవాలి.

♦ ఆల్కహాల్ ఉండే శానిటైజర్లు కనీసం 20 సెకన్లపాటుతో చేతులు శుభ్రం చేసుకోవాలి.

♦ బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నిషేధం. ఉమివేస్తే శిక్ష తప్పదు.

♦ ఎవరికి వారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా అనారోగ్యం ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలి.

♦ ఎవరైనా దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు టిష్యూలు, చేతి రుమాళ్లు, గుడ్డలను అడ్డుపెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని సూచించిన చోట మాత్రమే పడేయాలి.

♦ ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్ వినియోగించేలా ప్రోత్సహించాలి..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories