దీపావళి వేళ కేంద్రం మరో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన

దీపావళి వేళ కేంద్రం మరో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన
x
Highlights

దీపావళి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం మరో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. ఆత్మ నిర్భర 3.0 కింద కేంద్రం ఉద్దీపనలు చేపట్టనుంది. ఆత్మ నిర్భర్ రోజ్‌గార్‌ యోజన గురువారం కేంద్రం ప్రారంభించింది.

దీపావళి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం మరో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. ఆత్మ నిర్భర 3.0 కింద కేంద్రం ఉద్దీపనలు చేపట్టనుంది. ఆత్మ నిర్భర్ రోజ్‌గార్‌ యోజన గురువారం కేంద్రం ప్రారంభించింది. ఈ పథకం కింద ఉద్యోగాల కల్పనపై కేంద్రం సృష్టించనుంది. ఈపీఎఫ్ ఓ రిజిస్ట్రేషన్ కంపెనీల ద్వారా ఉద్యోగాల ప్రక్రియను చేపట్టనున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

లాక్ డౌన్ వలన ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఆత్మ నిర్భర్ రోజ్‌గార్‌ యోజన పథకం ద్వారా లబ్ధి లభించనుందని నిర్మల పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడుతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. కొవిడ్ తగ్దుతుండటంతో ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతున్నట్లు చెప్పారు. ఈ ఏడాది జీఎస్టీ వసూళ్లు పెరిగినట్లు తెలిపిన నిర్మల.. అక్టోబర్ నాటికి లక్షా 5 వేల కోట్ల జీఎస్టీ వసూళ్లు వచ్చినట్లు తెలిపారు.

మరోవైపు దేశంలో ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఆత్మనిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన తీసుకొచ్చినట్లు తెలిపారు. మొత్తం 2.65లక్షల కోట్లతో ఈ ప్యాకేజీని ప్రకటించారు. కొవిడ్‌ కారణంగా చాలా మంది ఉపాధిని కోల్పోయిన సమయంలో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు కేంద్రం ప్రోత్సాహకాలు కల్పించింది. అటు ఆత్మ నిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన కింద కొత్త ఉద్యోగులను తీసుకునే సంస్థలకు పీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌లో రెండేళ్ల పాటు సబ్సిడీ కల్పిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

అక్టోబరు 1 నుంచి ఈ రాయితీ వర్తిస్తుందని చెప్పారు. వెయ్యిలోపు ఉద్యోగులుండే సంస్థలకు ఉద్యోగుల వాటా, సంస్థల వాటా పీఎఫ్‌ మొత్తం 24శాతం కేంద్రమే భరిస్తుందని చెప్పారు. వెయ్యి మందికంటే ఎక్కువ ఉండే సంస్థలకు మాత్రం ఉద్యోగుల పీఎఫ్‌ వాటాను కేంద్రం ఇస్తుందని నిర్మల తెలిపారు.

కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఇప్పటివరకు మూడు ఉద్దీపన పథకాలను కేంద్రం ప్రకటించింది. అయితే ప్రస్తుతం ప్రకటించిన నాలుగో ఉద్దీపన ప్యాకేజీతో ఉద్యోగులు కోలుకోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థ గాడిలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories