కాలుష్య కారక వాహనాలపై కేంద్రం కొరడా

central government effect on polluting vehicles
x

Representational Image

Highlights

* పాత వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ వసూలుకు నిర్ణయం * 8 ఏళ్లు దాటితే గ్రీన్ ట్యాక్స్ తప్పనిసరి! * గ్రీన్‌ట్యాక్స్ ప్రతిపాదనలపై సంతకం చేసిన కేంద్ర మంత్రి గడ్కరీ

కాలం చెల్లిన వాహనాలకు ఇక చెక్ చెప్పనుంది కేంద్ర ప్రభుత్వం. కాలుష్యాన్ని వెదజల్లుతోన్న పాత బండ్లపై ఇకపై పన్ను వడ్డనకు సిద్ధమవుతోంది. గ్రీన్ ట్యాక్స్ పేరుతో వచ్చే ఈ పన్నులను పర్యావరణ పరిరక్షణకు వినియోగిస్తామంటోంది కేంద్ర ప్రభుత్వం. కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలపై కేంద్రం కొరడా ఝుళిపిస్తోంది. పాతబడిన వాహనాలకు గ్రీన్‌ ట్యాక్స్‌ విధించాలని కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఎనిమిది సంవత్సరాలు దాటిన వాహనదారులు ఇకనుంచి ట్యాక్స్ చెల్లించాల్సిందే. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ సంతకం చేశారు.

కాలుష్య నివారణలో భాగంగా 8 ఏళ్లు పైబడిన రవాణా వాహనాలకు 10 నుంచి 25 శాతం వరకు గ్రీన్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పునరుద్ధరణ సమయంలో ఈ ట్యాక్స్‌ వసూలు చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అలాగే, 15 సంవత్సరాల కంటే పాత వ్యక్తిగత వాహనాలు కూడా గ్రీన్‌ ట్యాక్స్‌ పరిధిలోకి వస్తాయని వెల్లడించారు. ఈ తరహా వాహనాల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ సమయంలో పన్ను వసూలు చేస్తారని చెప్పారు. కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో రిజిస్ట్రేషన్‌ అయ్యే వాహనాలకు అత్యధిక గ్రీన్‌ టాక్స్‌ వసూలు చేయాలన్న ప్రతిపాదన కూడా ఉందని పేర్కొన్నారు.

అయితే, హైబ్రిడ్‌, ఎలక్ట్రిక్‌, సీఎన్‌జీ, ఇథనాల్‌, ఎల్‌పీజీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలు కలిగిన వాహనాలకు ఈ ప్రతిపాదన నుంచి మినహాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు. 15 ఏళ్ల కంటే పాతవైన ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్‌ను నిలిపేయాలనే ప్రతిపాదన కూడా ఉందని పేర్కొన్నారు అధికారులు. పాత వాహనాలు కాలుష్య కారకాలుగా మారుతున్నాయని, అందుకే ఈ గ్రీన్‌ ట్యాక్స్‌ వసూలుకు నిర్ణయించినట్లు తెలిపారు. గ్రీన్ ట్యాక్స్‌ తో వచ్చిన మొత్తాన్ని పర్యావరణ పరిరక్షణకు వినియోగించనున్నారు.

అయితే రాష్ట్రాల సంప్రదింపుల తర్వాత గ్రీన్ ట్యాక్స్‌ను కేంద్రం నోటిఫై చేయనుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఇప్పటికే కాలం చెల్లిన వెహికిల్స్‌ను స్క్రాప్ కింద మార్చాలన్న ప్రతిపాదన ఉంది. బడ్జెట్‌ సమావేశాల్లోనే దీనికి ఆమోదం తెలిపే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాల సంప్రదింపుల తర్వాత గ్రీన్ ట్యాక్స్‌ నోటిఫై చేయనున్న కేంద్రం

Show Full Article
Print Article
Next Story
More Stories