ఆ 5 నగరాల్లో పరిస్థితి తీవ్రం.. మూడ్రోజుల్లో రంగంలోకి కేంద్ర బలగాలు


దేశంలో కరోనా వైరస్ పోరుకు కేంద్రం లాక్ డౌన్ విధించి పటిష్ట చర్యలు తీసుకుంటుంది.
దేశంలో కరోనా వైరస్ పోరుకు కేంద్రం లాక్ డౌన్ విధించి పటిష్ట చర్యలు తీసుకుంటుంది. ఆయా రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు సీఎంలతో సంప్రదింపులు జరుపుతోంది. రాష్ట్రాలలో పరిస్థితుల పై ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంది. అయితే కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు నీరుగారిపోకుండా చూడడంపై కేంద్రం దృష్టి సారించింది. క్షేత్రస్థాయికి అధికారుల్ని పంపించి పరిస్థితిని మదించాలని నిర్ణయించింది. మధ్యప్రదేశ్ (ఇండోర్), పశ్చిమ బెంగాల్ (కోల్‌కతా సహా మరికొన్ని ప్రాంతాలు), మహారాష్ట్ర (ముంబయి, పుణె), రాజస్థాన్ (జైపుర్)లలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్ నిబంధనల్ని ఏమాత్రం సడలించినా.. వైరస్ మరింతగా విజృంభించే అవకాశం ఉందని హెచ్చరించింది.
నాలుగు రాష్ట్రాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ నగరాలకు 6 వున్నాయి. మంత్రిత్వ శాఖల కేంద్ర బృందాలను మూడు రోజుల్లో పంపించనున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడిచింది. 4 రాష్ట్రాల్లో సామాజిక దూరం నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేయడం, ఆరోగ్య సిబ్బందిపై దాడులు జరుగుతుండడంతో కొన్నిచోట్ల పట్టణ ప్రాంతాల్లో సిటీ బస్సులు తిరుగుతుడడంపై, అటు కేరళలో కొన్ని నిబంధనల్ని సడలించడం కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. హాట్‌స్పాట్లు ఉన్న జిల్లాల్లో తగిన చర్యలు చేపట్టకుండా వదిలేస్తే దేశంలోని ఇతర చోట్లకూ ఆరోగ్యపరమైన తీవ్ర ముప్పు వస్తుందని పేర్కొంది.
ఇదివరకు జారీ చేసిన జాతీయ విపత్తు నిర్వహణ చట్టం-2005 కింద మార్గదర్శకాలను ఏమాత్రం నీరుగార్చవద్దని కచ్చితంగా పాటించాలని అన్ని రాష్ట్రాలకు హోం శాఖ కార్యదర్శి అజయ్‌భల్లా స్పష్టం చేశారు. కఠిన చర్యలను తీసుకోవాలే తప్ప సడలింపులు వద్దని తేల్చి చెప్పారు. సిటీ బస్సులు, రెస్టారెంట్లకు నుంచి పార్శిళ్లను మాత్రం తీసుకువెళ్లవచ్చని పేర్కొంది. సోమవారం నుంచి సడలింపులు ఇస్తూ కేరళ నిర్ణయాన్ని కేంద్రం ఆక్షేపణ నేపథ్యంలో వెనక్కి తీసుకుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



