వలస కార్మికులకు మాత్రమే ప్రయాణ అనుమతి : రాష్ట్రాలకు కేంద్రం స్పష్టీకరణ!

వలస కార్మికులకు మాత్రమే ప్రయాణ అనుమతి : రాష్ట్రాలకు కేంద్రం స్పష్టీకరణ!
x
Highlights

కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా నేటినుంచి‌ మూడో విడత లాక్‌డౌన్ దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది.

కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా నేటినుంచి‌ మూడో విడత లాక్‌డౌన్ దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. అయితే దేశ ఆర్ధిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. అయితే ఈ సడలింపులు కొన్ని రాష్ట్రాలు పాటిస్తుంటే మరికొన్ని దేశాలు మాత్రం పట్టించుకోవడం లేదు. దేశవ్యాప్తంగా 700 పైగా జిల్లాల్లో కరోనా పరిస్థితిని సమీక్షించిన కేంద్ర ప్రభుత్వం వైరస్‌ వ్యాప్తి తీవ్రతను బట్టి దేశాన్ని రెడ్, ఆరెంజ్, గ్రీన్‌ జోన్లుగా విభజించింది.

ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీ వరకు మూడో దశ లాక్ డౌన్ ను పొడిగించింది. దేశవ్యాప్తంగా సుమారు 130 రెడ్‌ జోన్లు, ఆరెంజ్‌ 284, గ్రీన్‌ జోన్లు 319 ఉన్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో19, ఆ తర్వాత మహారాష్ట్రలో 14 రెడ్‌ జోన్లు ఉన్నాయి. అయితే ఎటువంటి జోన్లతోను సంబంధం లేకుండా విమాన, రైలు, మెట్రో ప్రయాణాలు. స్కూళ్లు,కాలేజీలు, శిక్షణ, ఇతర విద్యాసంస్థలు, కోచింగ్‌ సంస్థలు, రెస్టారెంట్లు, హోటళ్లు, మాల్స్, సినిమా హాళ్లు, క్రీడా స్థలాలు, ప్రార్థనా స్థలాలు. రాజకీయ కార్యక్రమాలు, సామాజిక, సాంస్కృతిక, సభలు, సమావేశాలపై నిషేధం కొనసాగుతుంది.

ఇదే క్రమంలో లాక్‌డౌన్‌ కారణంగా వివిధ ప్రాంతాల్లో గత నలభై రోజులకు పైగా చిక్కుకుపోయి వలస కార్మికులు, తీర్థయాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులకు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు మాత్రమే ప్రయాణ వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దీంతో వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 6 కోట్ల మంది వలస కార్మికులకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఈ మేరకు హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ఇది కేవలం లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వారికి మాత్రమే వర్తిస్తుందని.. సొంతూళ్లకు మామూలుగా వెళ్లేవారికి, సొంతపనులపై వెళ్లేవారికి వర్తించదని స్పష్టత ఇచ్చింది కేంద్ర హోమ్ శాఖ. ఇదిలావుంటే రెండోవిడత లాక్ డౌన్ ను పొడిగించే సమయంలోనే గ్రామాల్లో ఉపాధి హామీ పనులకు వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories