బీఎఫ్-7పై కేంద్ర ప్రభుత్వం అలర్ట్.. కోవిడ్‌-19పై మోడీ కీలక సమావేశం

Central Government Alert On BF 7
x

బీఎఫ్-7పై కేంద్ర ప్రభుత్వం అలర్ట్.. కోవిడ్‌-19పై మోడీ కీలక సమావేశం

Highlights

* కొత్త వేరియంట్లను గమనిస్తున్నామన్న కేంద్రమంత్రి

Stay Safe: పలు దేశాల్లో కోవిడ్ విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత్ లో బీఎఫ్-7 వేరియంట్ వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. మాస్క్‌లు తప్పనిసరిగా ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ ఎయిమ్స్, ఆర్ఎంఎల్ ఆసుపత్రుల్లో మాస్క్ తప్పనిసరి చేశారు. బీఎఫ్-7 వేరియంట్‌తో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను అలెర్ట్ చేసింది. కోవిడ్‌‌పై మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ ముఖ్యమంత్రులు అధికారులు సమావేశాలు నిర్వహించారు.

కోవిడ్-19పై ప్రధాని మోడీ కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, నీతి ఆయోగ్ సీఈవో పరవేశ్వరన్ తదితరులు పాల్గొన్న వర్చువల్ మీట్‌లో కోవిడ్-19పై మోడీ సమీక్ష నిర్వహించారు. వైద్యాధికారులతో తాజా పరిస్థితిని ,సన్నద్దతను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఎన్ని కేసులున్నాయి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో అడిగి తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమైన సూచనలు చేశారు. జనసమర్ధ ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని ప్రధాని సూచించారు. ఎయిర్‌పోర్టుల వద్ద అప్రమత్తత పెంచాలని సూచించారు. వయసులో పెద్దవారు ప్రికాషనరీ డోస్ తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆసుపత్రుల్లో బెడ్స్, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల సంఖ్యను పెంచాలని తెలిపారు.

కొత్త కోవిడ్-19 వేరియంట్లను నిశితంగా గమనిస్తు్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపింది. చైనాలో కోవిడ్ ఇన్ఫెక్షన్లు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పార్లమెంట్ ఉభయ సభల్లో మాట్లాడారు. కోవిడ్ వ్యాప్తి నిరోధానికి తగిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరినట్లు తెలిపారు. మాస్క్ ధరించాలనే నిబంధనను విధించాలని, జీనోమ్ సీక్వెన్సింగ్‌ను పెంచాలని చెప్పినట్లు తెలిపారు. దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికుల కోసం RT PCR టెస్ట్‌ ప్రారంభించినట్లు చెప్పారు.

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రజలకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజలు గుంపులుగా చేరవద్దని, వివాహ వేడుకలు, రాజకీయ సమావేశాలు, విదేశీయానాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని కోరింది. భౌతిక దూరం పాటించడంతో పాటు సబ్బు, నీళ్లు , లేదా శానిటైజర్‌తో చేతులను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలని ఐ.ఎం.ఏ సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories