విద్యార్ధులు పాఠశాలలకు వెళ్లాలంటే వారి అనుమతులు తప్పనిసరి

విద్యార్ధులు పాఠశాలలకు వెళ్లాలంటే వారి అనుమతులు తప్పనిసరి
x
Highlights

దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజుల తరువాత దశలవారిగా లాక్ డౌన్ సడలింపులను...

దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజుల తరువాత దశలవారిగా లాక్ డౌన్ సడలింపులను ప్రకటించింది ప్రభుత్వం. దీంతో దేశంలోని అన్ని వ్యాపార సంస్థలు, రవాణా వ్యవస్థ ఇలా అన్ని ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం పాఠశాలలను కూడా ప్రారంభించాలని అనుమతులు జారీ చేసింది. కంటెయిన్‌మెంట్‌జోన్‌పరిధిలో లేని పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలను అక్టోబర్‌15 తరువాత తిరిగి తెరిచేందుకు కేంద్రం అనుమతించింది. అయితే ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మాత్రమే కాదని ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా పాఠశాలల పున:ప్రారంభించే విషయంలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాలకు వదిలివేసింది. అంతే కాదు విద్యార్ధుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు లిఖిత పూర్వక అనుమతి తప్పనిసరిగా ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించింది. హాజరు కోసం విద్యార్థులపై నిర్బంధం ఉండరాదని కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ ఓ ప్రకటనలో వివరించారు. హోంశాఖ నిర్దేశాల ప్రకారం తల్లితండ్రులు రాతపూర్వకంగా అనుమతించిన విద్యార్థులు మాత్రమే పాఠశాలలో తరగతులకు హాజరయ్యేందుకు వీలు కలుగుతుందని ఆయన వెల్లడించారు.

అదే విధంగా విద్యార్ధులుకు ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆన్ లైన్ క్లాస్ ల నిర్వహణపై ప్రభుత్వ మార్గదర్శకాలను మంత్రి వివరించారు. నర్సరీ విద్యార్థులకు 30 నిముషాలు, 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు ఒకటిన్నర గంటలు, అలాగే 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు అత్యధికంగా మూడు గంటల పాటు తరగతులు నిర్వహించాలని కాల వ్యవధిని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. విద్యార్థులు లాప్‌టాప్‌లు, మొబైల్‌ఫోన్లు, కంప్యూటర్లపై ఆన్‌లైన్‌తరగతులకు హాజరౌతున్న నేపథ్యంలో.. వారి కళ్లకు శ్రమ కలుగకుండా వారి గదుల్లో గాలి, వెలుతురు ధారాళంగా ఉండేలా చూడాలని ఆయన తల్లితండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఇక ఒక్కో పీరియడ్‌కాల వ్యవధి గరిష్ఠంగా 45 నిమిషాలు మాత్రమే ఉండాలని ఆయన సూచించారు.

ఇక పాఠశాలలు పున:ప్రారంభంపై కేంద్రం ఇచ్చిన మార్గదర్శాల పాఠశాలల్లో తప్పనిసరిగా గదులు, ఫర్నీచర్‌, విద్యా సామగ్రి, నీటి ట్యాంకులు, శౌచాలయాలు, ల్యాబ్‌లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. విషయాలకొస్తే విద్యార్థులు ఆన్‌లైన్‌తరగతులకు మొగ్గు చూపితే వాటినే ఎంచుకునేందుకు ప్రోత్సహించాలి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జాగ్రత్తల విషయంలో నిర్ణయం తీసుకోవాలి. విద్యార్థులు, ఉపాధ్యాయులు అనారోగ్యానికి గురైనప్పుడు వారు ఇంట్లో విశ్రాంతి తీసుకునేలా హాజరు విషయంలో వెసులుబాటు కల్పించాలి. భద్రతా ప్రమాణాలు తప్పని సరిగా పాటించేందుకు పోస్టర్లు, సంక్షిప్త సందేశాల ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయాలి. తల్లిదండ్రుల రాత పూర్వక అనుమతితో మాత్రమే విద్యార్థులు పాఠశాలకు హాజరు కావాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories