కేంద్రపాలిత ప్రాంతాల్లో డిస్కమ్‌ల ప్రైవేటీకరణ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

కేంద్రపాలిత ప్రాంతాల్లో డిస్కమ్‌ల ప్రైవేటీకరణ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
x
Nirmala Sitharaman (File Photo)
Highlights

కరోనా కష్టం నుంచి ప్రజలకు ఊరట కలిగించేందుకు ప్రధాని మోడీ ఆత్మ నిర్భార్ భారత్ పథకం ప్రకటించిన విషయం విదితమే.

కరోనా కష్టం నుంచి ప్రజలకు ఊరట కలిగించేందుకు ప్రధాని మోడీ ఆత్మ నిర్భార్ భారత్ పథకం ప్రకటించిన విషయం విదితమే. ఈ పథకంలో భాగంగా వివిధ రంగాల వారికి ఇచ్చే వెసులుబాట్లు.. ఆర్ధిక చేయూత గురించి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ రోజూ వారీ వివరిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా

నాలుగో విడత ప్యాకేజీ వివరాలను వెల్లడించారు. బొగ్గు, ఖనిజాలు, రక్షణ ఉత్పత్తులు, ఏరో స్పేస్‌ మేనేజ్‌మెంట్‌, పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌, స్పేస్‌, అటామిక్‌ ఎనర్జీకి సంబంధించి మొత్తం 8 రంగాల్లో కీలక సంస్కరణలు తీసుకొస్తున్నట్లు తెలిపారు. వాటికి సంబంధించిన వివరాలను ఇలా ఉన్నాయి..

గనుల రంగంలో సరళీకృత వ్యాపార విధానాలు

♦ 500 మైనింగ్‌ బ్లాకులను బహిరంగ, పారదర్శక వేలం

♦ అల్యూమినియం పరిశ్రల్లో పోటీతత్వాన్ని పెంచేందుకు ఇకపై బాక్సైట్‌, బొగ్గు బ్లాకులకు సంయుక్త వేలం

♦ బొగ్గు రంగంలో ప్రభుత్వానికి ఉన్న గుత్తాధిపత్యాన్ని తొలగింపు

♦ ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు అన్ని విధాలుగా చర్యలు

♦ టన్నుకు స్థిరమైన ధర కాకుండా ఇక రెవెన్యూ పంచుకునే విధానం

♦ సొంత అవసరాలు కలిగిన వినియోగదారులే (క్యాపిటివ్‌ మైనింగ్‌)కు మాత్రమే వేలంలో పాల్గొనే అనుమతి తొలిగింపు

♦ బొగ్గును బహిరంగ మార్కెట్‌లో విక్రయానికి అనుమతి 50 బ్లాక్స్‌ కేటాయిస్తున్నాం.

♦ బొగ్గు తవ్వకాలు, మౌలిక వసతుల కల్పనకు రూ.50వేలు కోట్లు

♦ గడువు కంటే ముందుగా లక్ష్యాలను చేరుకున్న వారికి ప్రోత్సహాకాలు

♦ డిస్కంలలో సంస్కరణలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో డిస్కమ్‌ల ప్రైవేటీకరణ

♦ భారతీయ అంతరిక్ష రంగంలో ప్రైవేటుకు భాగస్వామ్యం

♦ ఉపగ్రహాల్లో ప్రైవేటు కంపెనీలకు లెవెల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌, ప్రయోగాలు, అంతరిక్ష ఆధారిత సేవల్లో ప్రైవేటు భగస్వామ్యం

♦ కంపెనీలు సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఇస్రో సౌకర్యాలు, ఇతర ఆస్తులను వినియోగించుకోవడానికి అవకాశం

♦ గ్రహాన్వేషణ, బాహ్య అంతరిక్ష ప్రయాణం వంటి భవిష్యత్‌ ప్రాజెక్టుల్లో ప్రైవేటు రంగానికి అవకాశం

♦ ఇప్పటికే 12 ఎయిర్‌పోర్టులను పీపీపీ విధానంలో ప్రైవేటు కంపెనీలకు కేటాయింపు

♦ 6 ఎయిర్‌పోర్టులను సైతం ప్రపంచ స్థాయి విమానాశ్రయాలుగా రూపుదిద్దేందుకు అభివృద్ధి నిర్వహణకు ప్రైవేతీకరణ

♦ భారత ఎయిర్‌స్పేస్‌ వినియోగంలో హేతుభద్ధీకరన

♦ ఏడాదికి సుమారు రూ.1000 కోట్ల మేర విమానయాన రంగానికి లబ్ధి.

♦ విమానాశ్రయాల అభివృద్ధికి గానూ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కు రూ.2,300 కోట్లు

♦ 12 నూతన ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి రూ.13 వేలు కేటాయిపు

భద్రతా సిబ్బందికి అధునాతన రక్షణ సామగ్రి అందించాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో మేకిన్‌ ఇండియాను బలోపేతం చేయాల్సి ఉంది. సంవత్సరాల వారీగా కొన్ని ఆయుధాల జాబితాను తయారుచేస్తాం. వాటి దిగుమతిని నిలిపివేస్తాం. * దిగుమతి చేసుకునే విడి భాగా లు భారత్‌లోనే తయారు

♦ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డును కార్పొరేటైజ్డ్‌

♦ రక్షణ సరఫరాలో స్వయం ప్రతిపత్తి, జవాబుదారీతనం, సమర్థత పెరుగుదల

♦ రక్షణ ఉత్పత్తుల తయారీలో ఉన్న ఎఫ్‌డీఐ పరిమితిని ఆటోమేటిక్‌ రూట్‌లో 49 నుంచి 74 శాతానికి పెంపు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories