Center Cabinet: ఇవాళ సాయంత్రం కేంద్ర కేబినెట్‌ పునర్ వ్యవస్థీకరణ

Central Cabinet Reshuffle Today Evening
x

కేంద్ర కాబినెట్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Center Cabinet: 6గంటలకు మంత్రివర్గం ప్రమాణస్వీకారం * కొత్తగా 22మందికి చోటు దక్కే అవకాశం

Center Cabinet: కొన్ని రోజులుగా సర్వత్రా చర్చనీయాంశమైన కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఇవాళ సాయంత్రం కేబినెట్ పునర్​వ్యవస్థీకరణ జరగనుంది. ఇందులో 28 మంది వరకు కొత్తవారికి అవకాశం దక్కనున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు కూడా జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో శాసనసభ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు కేబినెట్ విస్తరణలో అధిక ప్రాధాన్యమివ్వనున్నట్లు సమాచారం.

ప్రతి దాంట్లో తన మార్క్‌ చూపిస్తున్న నరేంద్ర మోడీ తాజాగా... కేంద్ర మంత్రివర్గంలో కొత్తగా ఓ శాఖను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్ర సహకార శాఖ పేరుతో నూతన మంత్రిత్వ శాఖను ప్రధాని ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడం ఈ శాఖ లక్ష్యమని తెలిపాయి. సహకారంతోనే సమృద్ధి' అనే విజన్​ను సాక్షాత్కరించేందుకు దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో సహకార ఉద్యమానికి బలం చేకూర్చేందుకు న్యాయ, విధాన, పాలనాపరమైన కార్యాచరణను ఈ మంత్రిత్వ శాఖ రూపొందిస్తుందని చెప్పారు. ఈ శాఖకు కొత్త మంత్రిని ఇవాళ నియమించే అవకాశం ఉంది.

2019లో మోదీ రెండో దఫా ప్రధాని పదవి చేపట్టిన తర్వాత నుంచి ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. నిబంధనల ప్రకారం.. కేంద్ర మంత్రివర్గంలో గరిష్ఠంగా 81 మంది మంత్రులు ఉండొచ్చు. అయితే ప్రస్తుతం కేబినెట్‌లో 53 మంది మాత్రమే ఉన్నారు. చాలా మంత్రుల వద్ద ఒకటికంటే ఎక్కువ మంత్రిత్వ శాఖలు ఉండగా.. కొన్ని శాఖలకు సహాయ మంత్రులు లేరు. దీంతో మంత్రివర్గ విస్తరణపై కేంద్రం దృష్టిపెట్టింది.


Show Full Article
Print Article
Next Story
More Stories