Single Use Plastic: సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులపై కేంద్రం కీలక నిర్ణయం

Center Key Decision on Single Use Plastic
x
సింగల్ యూస్ ప్లాస్టిక్ (ఫైల్ ఇమేజ్)
Highlights

Single Use Plastic: వచ్చే ఏడాది నుంచి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులు, స్ట్రాలపై నిషేధం

Single Use Plastic: పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జులై నుంచి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ప్లేట్లు, కప్పులు, స్ట్రాలు, ట్రేలపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్ తయారీ, విక్రయం, వాడకంపై కూడా నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే పాలిథిన్‌ బ్యాగుల వాడకంపై కొత్త ఆంక్షలను తీసుకొచ్చింది. సెప్టెంబర్‌ 30 నుంచి 75 మైక్రాన్ల ప్లాస్టిక్‌ కవర్లకే అనుమతి ఉంటుందని తెలిపింది. వచ్చే ఏడాది డిసెంబర్‌ నుంచి 120 మైక్రాన్ల కవర్లే వాడాలని స్పష్టం చేసింది కేంద్రం.

Show Full Article
Print Article
Next Story
More Stories