Waqf Bill: లోకసభలో వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం

Waqf Bill: లోకసభలో వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం
x
Highlights

Waqf Bill: వివాదాస్పద వక్ఫ్ బిల్లును కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనకు దిగాయి. వారి నిరసనల నడుమే...

Waqf Bill: వివాదాస్పద వక్ఫ్ బిల్లును కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనకు దిగాయి. వారి నిరసనల నడుమే కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. అనంతరం ఈ బిల్లుపై చర్చను చేపట్టారు. దాదాపు 8గంటలపాటు చర్చ జరిగిన అనంతరం ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ బిల్లును ఆమోదింపచేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది..అయితే విపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.

వక్ఫ్ పాలకవర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసే విధంగా ఈ కొత్త బిల్లును కేంద్రం తీసుకువచ్చింది. ఈ మేరకు 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు చోటుచేసుకున్నాయి. ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే ఈ మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ బిల్లును గత ఏడాది ఆగస్టులోనే కేంద్రం లోకసభలో ప్రవేశపెట్టింది. అప్పుడు దీనిపై విపక్షాల నుంచి పెద్దెత్తున వ్యతిరేకత రావడంతో దీనిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపించింది. ఈ కమీట పలు ప్రతిపాదనలతో బిల్లుకు ఆమోదం తెలిపింది.

ఈ నేపథ్యంలో వక్ఫ్ బిల్లును కేంద్రం నేడు లోకసభ ముందుకు తీసుకువచ్చింది. లోకసభలో ఆమోదం పొందిన తర్వాత గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఉభయ సభల్లో అధికార ఎన్డీయేకు మెజార్టీ ఉన్నందున బిల్లు ఆమోదానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని బీజీపీ భావిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories