నిర్మాణ దారుల్లో దడ పుట్టిస్తోన్న స్టీలు, సిమెంట్ ధరలు

నిర్మాణ దారుల్లో దడ పుట్టిస్తోన్న స్టీలు, సిమెంట్ ధరలు
x

 స్టీలు, సిమెంట్ ధరలు

Highlights

*కరోనా లాక్‌డౌన్ సమయంలో తగ్గిన స్టీల్ ధర *10 నెలల్లోనే రూ. 20 వేలకు పైగా పెరిగిన స్టీలు *సిమెంటు ఏడాదిలో బస్తాకు 23 శాతం పైకి

ఓవైపు.. కరోనా, మరోవైపు లాక్‌డౌన్‌! ఇంకోవైపు.. ధరణి, రిజిస్ట్రేషన్‌, లే అవుట్‌ సమస్యలు! ఇలా దాదాపు పది నెలలుగా నిర్మాణ రంగంలో వేగం తగ్గింది. భారీ ప్రాజెక్టులు వాయిదా పడ్డాయి.. అయినప్పటికీ స్టీల్, సిమెంట్ ధరలు తగ్గలేదు. అమాంతం పెరిగాయి. అన్‌లాక్ లో స్టీల్‌కు రెక్కలొచ్చాయి. నిర్మాణదారుల్లో దడ పుట్టిస్తున్న స్టీల్, సిమెంట్ ధరలపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ...

కరోనా లాక్‌డౌన్ సమయంలో షాప్స్, ఫ్యాక్టరీలో క్లోజ్ కావడంతో.. స్టీల్ ధర తగ్గింది. ఆ తర్వాత నిర్మాణ రంగం అంతగా పుంజుకోకపోయిన స్టీల్‌ ధరలు కొండెక్కాయి. గత 10 నెలల్లోనే స్టీలు 20 వేలకుపైగా పెరిగింది. సిమెంటు ఏడాదిలో బస్తాకు 23 శాతం పెరిగి నిర్మాణ దారుల్లో దడ పుట్టిస్తోంది. దాంతో వ్యక్తిగత ఇళ్ల నిర్మాణాలను తగ్గించుకున్నారు.

లాక్‌డౌన్‌కు ముందు సిమెంట్‌ బస్తా ధర 270 ఉండగా ఇప్పుడది రూ.330-350కి చేరింది. అలాగే టన్ను ఉక్కు ధర లాక్‌డౌన్‌కు ముందు రూ.37 వేలు ఉంటే.. ఇప్పుడు రూ.60-70 వేల వరకూ చేరింది. సిమెంట్‌, ఉక్కు కంపెనీలు కుమ్మక్కై ధరలు పెంచుతున్నాయని సాక్షాత్తూ కేంద్ర మంత్రి గడ్కరీ నెల రోజుల్లోనే రెండుసార్లు ఆగ్రహం వ్యక్తం చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

సిమెంట్‌, స్టీల్‌ ధరల పెరుగుదల ద్వారా నిర్మాణదారుల పైనే కాదు.. ప్రభుత్వం పైనా అదనపు భారం పడుతోంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులతో పాటు రోడ్ల నిర్మాణలోనూ బడ్జెట్ పెరిగిపోతుంది. ఇల్లు కట్టుకునే ప్రతి సామాన్యుడికి స్టీల్, సిమెంట్ అవసరం. ధరలు పెరగడానికి ఎక్స్‌ పోర్టింగ్, రా మెటీరియల్ సమస్య వుందని అంటున్నారు.

సిమెంట్ ,స్టీల్ ధరలు పెరగడంతో చిన్న ,మధ్య, పెద్ద తరగతి గుత్తేదారులు ఇబ్బంది పడుతున్నారు. కాంట్రాక్టర్లు, బిల్డర్లను దృష్టిలో పెట్టుకుని కొద్దిగా టాక్సేషన్ లో వెసులు బాటు కల్పించి, ధరలు నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతోంది బిల్డర్స్ అసోసియేషన్..




Show Full Article
Print Article
Next Story
More Stories