Wendell Rodricks: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ వెండెల్ రోడ్రిక్స్ ఇకలేరు.. ఆ ముచ్చట తీరకుండానే..

Wendell Rodricks: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ వెండెల్ రోడ్రిక్స్ ఇకలేరు.. ఆ ముచ్చట తీరకుండానే..
x
Highlights

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ వెండెల్ రోడ్రిక్స్ మరణించారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన బుధవారం గోవాలోని తన ఇంటి వద్ద తుది శ్వాస విడిచారు....

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ వెండెల్ రోడ్రిక్స్ మరణించారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన బుధవారం గోవాలోని తన ఇంటి వద్ద తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 59 సంవత్సరాలు. అయన చనిపోతూ.. తాను ఇన్‌స్టాగ్రామ్‌ చివరి పోస్ట్‌లో గోవాలోని తన కాస్ట్యూమ్ మ్యూజియంలో పనిచేస్తున్నట్లు చెప్పారు. "ఫైనల్ ప్లాస్టరింగ్" అని రోడ్రిక్స్ మూడు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు. ఆయన తాయరు చేసిన మోడా.. గోవా మ్యూజియం భారతదేశపు మొట్టమొదటి కాస్ట్యూమ్ మ్యూజియం అవుతుంది. కాగా దీనిని కొల్వాలేలోని 450 సంవత్సరాల పురాతన సాంప్రదాయ గోవా విల్లాలో ఉంచాలని అధికారులు నిర్ణయించారు.

వెండెల్ రోడ్రిక్స్ మరణంతో ఆయన స్నేహితులతో పటు సినీ రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. వారిలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.. అందులో.. 'ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ & నిజ్ గోయెంకర్ పద్మ శ్రీ వెండెల్ రోడ్రిక్స్ ఆకస్మిక మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన ఆదర్శప్రాయమైన పని ఫ్యాషన్ ప్రపంచంలో చెరగని ముద్ర వేసింది. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సంతాపం , ఈ కష్ట సమయంలో దేవుడు వారిని ఓదార్చాలని' కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన సంతాపాన్ని తెలియజేస్తూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు అందులో.. "భారతదేశపు ప్రఖ్యాత డిజైనర్లలో ఒకరైన వెండెల్ రోడ్రిక్స్ అకాల మరణం గురించి విన్నప్పుడు షాక్ అయ్యాను. ఆయన ప్రియమైనవారికి నా హృదయపూర్వక సంతాపం. అంటూ ట్వీట్ చేశారు.

అలాగే ఆయన మరణంపై గోవా రాష్ట్ర మంత్రి విశ్వజిత్ రాణే ట్విట్టర్‌లో ఇలా వ్రాశారు, "నా మంచి స్నేహితుడు మరియు డిజైనర్ వెండెల్ రోడ్రిక్స్ ఆకస్మిక మరణం చాలా బాధ కలిగించింది. ఆయన పనితనం, నైపుణ్యం ఎప్పటికి ఆదరించబడతాయి.. ఆయన కుటుంబానికి, ప్రియమైన వారికి నా హృదయపూర్వక సంతాపం. " అని తెలిపారు.

చిత్రనిర్మాత ఒనిర్ కూడా రోడ్రిక్స్ మృతిచెందడంతో సంతాపం తెలిపారు, 'నా స్నేహితుడు వెండెల్ రోడ్రిక్స్ ఆకస్మిక మరణం గురించి విన్నప్పుడు పూర్తిగా షాక్ అయ్యాను.. ఆయన మరణం హృదయ విదారకంగా ఉంది. అతను తన డ్రీమ్ ప్రాజెక్ట్ కల సాకారం చేసుకునే సమయంలో ఇలా జరగడం విచారకరంగా ఉంది.' అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories