Bengaluru: బెంగళూరులో రేవ్ పార్టీ.. పట్టబడ్డ తెలుగు సినీ ప్రముఖులు

CCB police bust rave party in Electronic City Farm House, seize Cocaine and MDMA
x

Bengaluru: బెంగళూరులో రేవ్ పార్టీ.. పట్టబడ్డ తెలుగు సినీ ప్రముఖులు

Highlights

Bengaluru: రేవ్ పార్టీ నిర్వహించిన హైదరాబాద్‌కు చెందిన వాసు

Bengaluru: బెంగళూరులో రేవ్ పార్టీపై బెంగళూరు సిటీ పోలీసుల దాడి చేశారు. పార్టీలో పాల్గొన్న 100 మందికి పైగా యువతీయువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పార్టీలో MDMA, కొకైన్‌ వినియోగించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ పార్టీని నిర్వహించింది హైదరాబాద్‌‌కు చెందిన వాసుగా పోలీసులు గుర్తించారు. తన బర్త్ డే పేరుతో ఆంధ్రాకు చెందిన యువతను ఈ పార్టీకి ఆహ్వానించినట్టు గుర్తించారు. రేవ్ పార్టీలో పాల్గొన్నవారంతా బడాబాబులు.. సోసైటీలో ప్రముఖులుగా గుర్తించారు. పార్టీ జరిగిన ప్రాంతంలో మంత్రి కాకాణి పేరుతో ఓ బెంజ్ కారు స్టిక్కర్ గుర్తించినట్టు తెలుస్తుంది.

ఎలక్ట్రానిక్ సిటీలోని కాన్ కార్డ్ యజమాని గోపాల రెడ్డికి చెందిన జీఆర్ ఫామ్స్ హౌస్‌లో రేవ్ పార్టీ జరిగింది. పార్టీ కోసం ఆంధ్రా నుంచి విమానంలో యువతీ యువకులను నిర్వాహకులు ఆహ్వానించారు. ఆదివారం పొద్దుపోయాక.. ప్రారంభమైన పార్టీ.. తెల్లవారుజామును 6 గంటల వరకూ కొనసాగింది. ఈ పార్టీలో పాల్గొన్న వారిలో ప్రముఖులే అధికంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వారందరినీ గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే.. సిటీలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో.. సిటీలోని పోలీసులు ఇబ్బందులు ఉంటాయని.. గ్రహించి.. సిటీ శివారులోని ఎలక్ట్రానిక్ సిటిలో ఈ పార్టీని ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ రేవ్ పార్టీ కోసం 30 నుంచి 50 లక్షల వరకూ ఖర్చు చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం నార్కోటిక్ స్నిపర్ డాగ్స్‌తో రేవ్ పార్టీ జరిగిన ప్రాంతాన్ని తనికీ చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories