CBSE Board Exams 2026: CBSE బోర్డు పరీక్షలు 2026లో కీలక మార్పులు ప్రకటించిన బోర్డు


CBSE Board Exams 2026: CBSE బోర్డు పరీక్షలు 2026లో కీలక మార్పులు ప్రకటించిన బోర్డు
CBSE Board Exams 2026: CBSE 2026 బోర్డు పరీక్షల్లో కీలక మార్పులు. 12వ తరగతికి ఆన్‌స్క్రీన్ మార్కింగ్, 10వ తరగతికి డ్యూయల్ ఎగ్జామ్ విధానం అమలు.
Central Board of Secondary Education (సీబీఎస్‌ఈ) 2026 సంవత్సరానికి సంబంధించిన 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షల మార్గదర్శకాలను లైవ్ వెబ్‌కాస్ట్ ద్వారా వెల్లడించింది. పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విధానాల్లో కీలక మార్పులను బోర్డు ప్రకటించింది. పరీక్షల అనంతరం ఉండే పని భారం తగ్గించడం లక్ష్యంగా కొత్త విధానాలను తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు.
సీబీఎస్‌ఈ కంట్రోలర్ Sanyam Bhardwaj మాట్లాడుతూ 10వ, 12వ తరగతి పరీక్షల తర్వాత ఉండే మూల్యాంకన ఒత్తిడిని తగ్గించడమే ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఈ ఏడాది నుంచి 12వ తరగతి పరీక్షలకు ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) సిస్టమ్ అమలు చేయనున్నట్లు వెల్లడించారు. డిజిటల్ మూల్యాంకన విధానంతో టోటలింగ్ తప్పులు, మూల్యాంకన లోపాలు తగ్గుతాయని, పారదర్శకత పెరుగుతుందని తెలిపారు.
12వ తరగతి ఆన్సర్ షీట్లను హై సెక్యూరిటీ కేంద్రాల్లో స్కాన్ చేసి డిజిటల్ రూపంలో ఉపాధ్యాయులకు అందజేస్తారు. ప్రతి పేజీకి ప్రత్యేక కోడ్ ఇవ్వబడుతుంది. విద్యార్థుల వ్యక్తిగత వివరాలు మూల్యాంకన సమయంలో కనిపించవు. మొత్తం మార్కులు సిస్టమ్ స్వయంగా లెక్కిస్తుంది. అవసరమైతే సీనియర్ ఎగ్జామినర్లు మోడరేషన్ నిర్వహిస్తారు.
10వ తరగతి పరీక్షల విషయంలో ఆన్సర్ పేపర్లను భౌతికంగా (ఫిజికల్‌గా) పరిశీలిస్తారని బోర్డు స్పష్టం చేసింది. అయితే సైన్స్, సోషల్ స్టడీస్ ప్రశ్నాపత్రాలను విడగొట్టే విధానం అమలు చేయనున్నారు. అదేవిధంగా 10వ తరగతికి డ్యూయల్ బోర్డు ఎగ్జామ్ విధానాన్ని కూడా ప్రవేశపెడుతున్నారు.
సీబీఎస్‌ఈ చైర్‌పర్సన్ Rahul Singh మాట్లాడుతూ వచ్చే ఏడాది కూడా పరీక్షా వ్యవస్థలో మరిన్ని ప్రధాన మార్పులు తీసుకురానున్నట్లు ప్రకటించారు.
2026 బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్నాయి. 10వ తరగతి పరీక్షలు మార్చి 10తో ముగియనున్నాయి. 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 9 వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది సుమారు 46 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. దేశవ్యాప్తంగా మరియు విదేశాల్లో కలిపి 8,074 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



