డిహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లను అదుపులోకి తీసుకున్న సీబీఐ

డిహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లను అదుపులోకి తీసుకున్న సీబీఐ
x
Highlights

యస్ బ్యాంక్ కేసుకు సంబంధించి డిహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లు కపిల్ వధవన్, ధీరజ్ వధవన్‌లను సిబిఐ అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.

యస్ బ్యాంక్ కేసుకు సంబంధించి డిహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లు కపిల్ వధవన్, ధీరజ్ వధవన్‌లను సిబిఐ అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మహాబలేశ్వర్‌లో 14 రోజులపాటు క్వారంటైన్ లో ఉన్న వీరిని సిబిఐ బృందం అదుపులోకి తీసుకుంది.

డిహెచ్‌ఎఫ్‌ఎల్‌కు అనుమానాస్పదంగా ఇచ్చిన రుణాలకు సంబంధించి సిబిఐ మార్చి 7 న యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్ మరియు వధావన్‌లపై కేసు నమోదు చేసింది, ఇందులో కపూర్ కుటుంబ క్విడ్ ప్రో కో కు పాల్పడినట్టు అనుమానిస్తోంది. వధవన్లకు పలు మార్లు సమన్లు ఇచ్చారు.. అయినా సోదరులు ఇద్దరు విచారణకు హాజరుకాలేదు, దీని తరువాత ముంబైలోని సిబిఐ కోర్టు ఇద్దరికీ వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది.

దాంతో వీరిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.. ఈ క్రమంలో వారిని పట్టుకోవటానికి సిబిఐ ఒక సెర్చ్ ను ప్రారంభించింది. ఈ క్రమంలో ఆదివారం, సిబిఐ అధికారులు వధవాన్లను అదుపు తీసుకున్నట్లు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ట్విట్టర్లో ప్రకటించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories