logo
జాతీయం

కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఇళ్లపై సీబీఐ దాడులు

CBI Raids Congress Leader Chidambarams Properties
X

కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఇళ్లపై సీబీఐ దాడులు

Highlights

*ఢిల్లీ, ముంబై, తమిళనాడు సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు

Delhi: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నై, ఢిల్లీ, ముంబై, శివగంగై ప్రాంతాల్లోని చిదరంబరంకు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు సోదాలు చేస్తున్నారు. చిదంబరం కొడుకు కార్తీ చిదంబరంపై నమోదైన కేసులకు సంబంధించి సీబీఐ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.

మొత్తం 7 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నట్టుగా సమాచారం. గతంలో కూడా చిదరంబరం, కార్తీ చిదంబరం నివాసం, కార్యాలయాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేసింది. ఇక, 2010 నుంచి 2014 మధ్య కాలంలో విదేశీ రెమిటెన్స్‌లకు సంబంధించి సీబీఐ కార్తీ చిదంబరంపై తాజాగా కొత్త కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే సీబీఐ సోదాల నేపథ్యంలో కార్తీ చిదంబరం ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇలా ఎన్నిసార్లు జరిగిందో లెక్క మరిచిపోయానని అన్నారు. తప్పకుండా రికార్డు చేయాలని ట్వీట్ చేశారు.


Web TitleCBI Raids Congress Leader Chidambaram's Properties
Next Story