దేశవ్యాప్తంగా 150 చోట్ల సీబీఐ తనిఖీలు

దేశవ్యాప్తంగా 150 చోట్ల సీబీఐ తనిఖీలు
x
Highlights

అవినీతి పరుల భరతం పట్టేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దాడులు చేస్తోంది. ఏకకాలంలో 150 ప్రాంతాల్లో సోదాలు చేపడుతోంది. భారీ...

అవినీతి పరుల భరతం పట్టేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దాడులు చేస్తోంది. ఏకకాలంలో 150 ప్రాంతాల్లో సోదాలు చేపడుతోంది. భారీ స్థాయిలోనే అవకతవకలను పాల్పడిన శాఖలను గుర్తించిన సీబీఐ ఆ యా శాఖలపై ప్రత్యేక దృష్టి సారించింది. మైనింగ్, రైల్వే, కస్టమ్స్‌ శాఖలపై ప్రత్యేక దృష్టి సారించిన సీబీఐ అధికారులు అవినీతి పరుల గుండెల్లో గుబులు రేపుతున్నారు. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, జైపూర్, జోధ్‌పూర్, గుహవాటి, శ్రీనగర్, షిల్లాంగ్, చండిఘర్, షిమ్లా, చెన్నై, మధురై, కోల్‌కతా, బెంగళూరు, ముంబై, పూణె, గాంధీనగర్, గోవా, భోపాల్, జబల్‌పూర్, నాగ్‌పూర్, పాట్నా, రాంచీ, ఘజియాబాద్, డెహ్రాడూన్, లక్నో నగరాల్లో ఈ తనిఖీలు జరిగాయి. స్పెషల్ డ్రైవ్ పేరుతో సీబీఐ అధికారులు ఈ తనిఖీలను చేపట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories