Rajasthan: రాజస్థాన్‌ వెటర్నరీ వైద్యుల అరుదైన ఆపరేషన్‌.. సింహానికి కాటరాక్ట్‌ సర్జరీ

Cataract Surgery For A Lion By Rajasthan Veterinary Doctors
x

Rajasthan: రాజస్థాన్‌ వెటర్నరీ వైద్యుల అరుదైన ఆపరేషన్‌.. సింహానికి కాటరాక్ట్‌ సర్జరీ

Highlights

Rajasthan: గత కొంతకాలంగా కంటి శుక్లాలతో బాధపడ్డ రియాజ్‌

Rajasthan: రాజస్థాన్‌ జోధ్‌పూర్‌లో వెటర్నరీ డాక్టర్లు అరుదైన ఆపరేషన్‌ చేశారు. ఒక వృద్ధ సింహానికి కంటి చూపు ప్రసాదించారు. జోద్‌పూర్‌లోని మాచియా బయలాజికర్‌ పార్క్‌లో రియాజ్‌ అనే సింహం కొద్ది రోజులుగా కాటరాక్ట్‌ సమస్యతో బాధపడుతోంది.. కళ్ళు కనిపించక పోవడంతో ఆహారం కూడా సరిగా తీసుకోలేకపోవడంతో చిక్కి శల్యమయ్యింది.. సింహం అనారోగ్యాన్ని గమనించిన జూ నిర్వాహకులు వైడ్యునికి చూపించారు. కంటి శుక్లాలతో సింహం పూర్తిగా కంటి చేపు కోల్పోయింది. సంహాన్ని పరిశీలించిన వైద్యులు సర్జరీ ద్వారానే కంటిచూపు సరిచేయాలని నిర్ణయించారు. రియాజ్‌కు కంటి ఆపరేషన్‌ సక్సెస్‌ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం రియాజ్‌ గతంలో లాగేనే చూడగలుగుతోంది.. సర్జరీ చేసిన వైద్యులను అందరూ అభినందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories