Maharastra: కేంద్రమంత్రి నారాయణ్ రాణేపై కేసు నమోదు

Case Registered Against Narayan Rane For Controversial Comments Against Maharastra Chief Minister Uddhav Thackeray
x

కేంద్రమంత్రి నారాయణ్ రాణే (ఫైల్ ఫోటో)

Highlights

* మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై నారాయణ్ రాణే అభ్యంతర వ్యాఖ్యలు * శివసేన ఫిర్యాదు మేరకు రాణేపై పూణేలో కేసు నమోదు

Maharashtra: కేంద్రమంత్రి నారాయణ్ రాణేపై పూణే పోలీసులు మరో కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై నారాయణ్ రాణే అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. దీంతో శివసేన ఫిర్యాదు మేర రాణేపై పూణే నగరంలోని చతుర్ శృంగి పోలీసులు ఐపీసీ సెక్షన్ 153, 505 కింద మరో కేసు నమోదు చేశారు. ఉద్ధవ్ ఠాక్రే చేసిన ప్రసంగంలో స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరాన్ని మర్చిపోయారని రాణే ఆరోపించారు. స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం గురించి సీఎంకు తెలియకపోవడం సిగ్గుచేటు, సంవత్సరం గురించి ఆరా తీసేందుకు సీఎం వెనుతిరిగారు, నేను అక్కడ ఉంటే గట్టి సమాధానం చెప్పేవాడిని అని రాణే వ్యాఖ్యానించారు.

మహారాష్ట్ర సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాణేపై నాసిక్ పోలీసులు కూడా కేసు నమోదు చేసి, అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు సమాచారం. కేంద్రమంత్రి నారాయణ్ రాణే వ్యాఖ్యలపై శివసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. నారాయణ రాణే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పలు చోట్ల ఆందోళనకు దిగారు.

Show Full Article
Print Article
Next Story
More Stories