అలీగఢ్‌ యూనివర్సిటీలో 1,000 మంది విద్యార్ధులపై కేసు

అలీగఢ్‌ యూనివర్సిటీలో 1,000 మంది విద్యార్ధులపై కేసు
x
Highlights

పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే.

పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. అయితే సీఏఏకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో నిరసనలు హోరెత్తాయి. అంతేకాకుండా అలీగఢ్‌ యూనివర్సిటీకి చెందిన దాదాపు ఒక వేయి మందిపైగా విద్యార్థులపై ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌(RAF) కేసులు నమోదయ్యాయి. యూనివర్సిటీకి చెందిన దాదాపు 1300 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 15న నిరసనల పేరుతో యూనివర్సిటీలో హింసకు పాల్పడటం, ప్రభుత్వాస్తులు ధ్వంసం చేయడం వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నివేదికలో పేర్కొంది. దీనిపై పోలీసులు స్పందించారు. పదివేల మందిపై కేసు నమోదు చేశామన్న వార్తల్లో నిజం లేదు. వేయి మంది విద్యార్ధులపై కేసు నమోదు చేశామని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్‌ బులంద్‌షహర్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పోలీసుపై నిరసకారులు దాడులు చేశారు. ఓ పోలీస్‌ వ్యాన్‌ను తగులబెట్టారు. నిరసనకారులు పోలీసులపై దాడులు చేశారు. దీంతో పోలీసులు వారిపై వాయుప్రయోగించిన సంగతి తెలిసిందే. దీనిని యూపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వాస్తులు ధ్వంసం చేసిన వారిపై గుర్తించి కేసులు పెట్టడమే కాకుండా.. నష్టపరిహారం వారితోనే కట్టించేలా చర్యలు తీసుకుంది.

ఉత్తరప్రదేశ్‌ పంథానే కొనసాగాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల19న మంగళూరులో చెలరేగిన హింసలో ప్రభుత్వ ఆస్తులు భారీగా ధ్వంసమయ్యాయి. ప్రభుత్వాస్తులు ధ్వంసం చేసిన నిరసనకారుల నుంచే పరిహారాన్ని వసూలు చేస్తామని బీజేపీ శాఖ ట్వీట్‌ ద్వారా తెలిపింది. ఈ హింసకాండలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

తమిళనాడు తౌహీద్‌ జమాత్ ఆధ్వర్యలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేపట్టింది. మరోవైపు పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్నార్సీకి వ్యతిరేకంగా జపాన్‌ రాజధాని టోక్యోలోని భారత రాయభార కార్యాలయం వద్ద ప్రవాస భారతీయులు ర్యాలీ చేపట్టారు. ఈ చట్టాల ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో డిసెంబర్ 20న పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున అల్లర్లు చోటుచేసుకున్నాయి. నిరసనకారులు పోలీసులపై దాడి చేయడంతోపాటు ఆరు వాహనాలకు నిప్పు అంటించారు. ఈ ఘటనలో పోలీసులు టియర్‌ గ్యాస్‌ను ఉపయోగించి ఆందోళన కారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఈ అల్లర్లలో కొందరు అల్లరిమూకలు హిందూ పోలీసుపై దాడికి యత్నించాయి. ఈ నేపథ్యంలో ఓ ముస్లిం వ్యక్తి వచ్చి హజ్జీ ఖాదిర్‌ రక్షించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికి పలు చోట్లు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజల్లో అపోహలు తొలగించడానికి సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. విద్యావంతుడైన కేటీఆర్ సీఏఏపై, ఎన్పీఆర్‌పై తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. ఇక, ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎం చెప్పు చేతల్లో నడుస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు. ముస్లిం మైనారిటీల మెప్పు కోసమే కేసీఆర్ పని చేస్తున్నారన్న లక్ష్మణ్ హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మూల్యం చెల్లించిస్తుందని లక్ష్మణ్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories