హిమాచల్ ప్రదేశ్‌లో విరిగిన కొండచరియలు.. కొండరాళ్ల నుంచి తృటిలో తప్పించుకున్న కార్లు

Cars Narrowly Miss Being Crushed By Landslide In Himachal
x

హిమాచల్ ప్రదేశ్‌లో విరిగిన కొండచరియలు.. కొండరాళ్ల నుంచి తృటిలో తప్పించుకున్న కార్లు

Highlights

Himachal Pradesh: భారీ కొండ రాళ్లు నుంచి తప్పిన ప్రమాదం

Himachal Pradesh: ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్‌లో భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి .అయితే అదృష్టవశాత్తు కొన్ని కార్లు కొండరాళ్ల బారి నుంచి తృటిలో తప్పించుకున్నాయి. కొంత ఆలస్యమైతే బండరాళ్ల కింద అవి నలిగిపోయేవి. హిమాచల్‌ ప్రదేశ్‌లోని సోలన్‌లో ఈ సంఘటన జరిగింది. కొండచరియలు విరిగిపడుతుండగా కొన్ని కార్లు వేగంగా దూసుకెళ్లాయి. భారీ కొండ రాళ్లు పడటం నుంచి తృటిలో తప్పించుకున్నాయి.

ఒళ్లు జలదరింపజేసేలా ఉన్న వీడియో క్లిప్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.కాగా, భారీ వర్షాల వల్ల హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలో వరదలు సంభవించాయి. దీంతో కసోల్ ప్రాంతంలో అనేక కార్లు కొట్టుకుపోయాయి. అలాగే జిల్లాలోని బియాస్ నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆట్‌-బంజార్‌ను కలిపే వంతెన కొట్టుకుపోయింది. భారీ వర్షాలకు హిమాచల్‌ ప్రదేశ్‌లో పదుల సంఖ్యలో చనిపోయారు. ఎందరో నిరాశ్రులయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories