నదిలో పడిపోయిన కారు..కారులో చిన్నారిని బయటకు తీసి విసిరేసిన వ్యక్తి

నదిలో పడిపోయిన కారు..కారులో చిన్నారిని బయటకు తీసి విసిరేసిన వ్యక్తి
x
Highlights

ఓ కారు అదుపుతప్పి నదిలో పడిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. మధ్యప్రదేశ్‌లోని నివారీ జిల్లా, ఓర్చాలో ఓ బ్రిడ్జి మీదుగా ప్రయాణిస్తోన్న కారుకు...

ఓ కారు అదుపుతప్పి నదిలో పడిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. మధ్యప్రదేశ్‌లోని నివారీ జిల్లా, ఓర్చాలో ఓ బ్రిడ్జి మీదుగా ప్రయాణిస్తోన్న కారుకు ఎదురుగా ఆటో వచ్చింది. దీంతో దాన్ని తప్పించే ప్రయత్నంలో కారు నడుపుతున్న వ్యక్తి కారుపై నియంత్రణ కోల్పోవడంతో అది నదిలో పడింది.

నది పెద్దగా లోతు లేకపోవడంతో కారులో ఉన్న వారందరూ క్షేమంగా బయటపడ్డారు. అయితే కారులోని చిన్నారిని బయటకు తీసిన ఓ వ్యక్తి బ్రిడ్జిపై ఉన్న వ్యక్తుల వైపునకు ఆ పసివాడిని విసిరేశాడు. అయితే, వారు ఆ చిన్నారిని క్యాచ్ పట్టలేకపోవడంతో మళ్లీ నీళ్లలో పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న స్థానికుడు నీళ్లలోకి దూకి చిన్నారిని కాపాడాడు. అనంతరం మిగతావారిని స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. వారందరూ స్వల్పగాయాలతో బయటపడ్డారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories