ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌ హైవేపై కారు దగ్ధం

Car Catches Fire on Mumbai-Pune Expressway
x

ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌ హైవేపై కారు దగ్ధం

Highlights

*పూర్తిగా కాలిపోయిన కారు.. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు

Fire Accident: మహారాష్ట్రలో పుణే-ముంబై ఎక్స్‌ప్రెస్‌ వే పై ఓ కారుకు మంటలంటుకున్నాయి. నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు కిందకు దిగి ప్రాణాలు కాపాడు కున్నారు.. అగ్నికీలలు భారీగా చెలరేగడంతో వెనక వస్తున్న వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో హైవేపై కొన్ని కిలోమీటర్ల వరకు ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. వాహన దారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు.. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మంటలు పూర్తిగా అదుపులోకి రావడంతో వాహనాలు మెల్లిగా కదులుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories