Amarinder Singh: కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ ప్రకటన

Captain Amarinder Singh Announced his New Party
x

కొత్త పార్టీ ప్రకటన చేసిన అమరిందర్ సింగ్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Amarinder Singh: ఈసీ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే పార్టీ పేరు ప్రకటన

Amarinder Singh: పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ కొత్త పార్టీపై క్లారిటీ వచ్చింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానని, ఎన్నికల కమిషన్‌ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే పార్టీ పేరు, ఎన్నికల గుర్తును నిర్ధారిస్తానన్నారు. ఇదే సమయంలో కొత్త పార్టీ పేరుపై ఇంకా స్పష్టత రాలేదన్న కెప్టెన్ దీనికి సంబంధించి తమ న్యాయవాదులు కసరత్తు చేస్తున్నారన్నారు.

మరోవైపు పార్టీ ప్రకటన తర్వాత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాల్లో పోటీ చేస్తామని కెప్టెన్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో.. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు తమ పార్టీలోకి వస్తారన్నారు. అలాగే, నవజ్యోత్ సింగ్ సిద్ధుపై మరోసారి కెప్టెన్ ఫైర్ అయ్యారు. సిద్ధు ఎక్కడ పోటీ చేసినా దీటుగా నిలువరిస్తామని తేల్చి చెప్పారు. సిద్ధూ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి పార్టీ ప్రతిష్ట 25 శాతం దిగజారిందని సర్వేలు వెల్లడించాయంటూ హాట్‌ కామెంట్స్ చేశారు. అయితే, బీజేపీతో కూటమి ఉండదని, సీట్ల సర్దుబాటుకు మాత్రం సిద్ధంగా ఉన్నట్లు కెప్టెన్ స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే.. రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్లు కెప్టెన్ అమరీందర్ సింగ్ వెల్లడించారు. సాగు చట్టాల అంశంపై అమిత్‌ షాతో చర్చి్చనున్నట్లు అమరీందర్ సింగ్ తెలిపారు. కాగా, ఈ భేటీకి దాదాపు 25 నుంచి 30మంది నేతలో హాజరుకానున్నట్లు కెప్టెన్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories