గాలి జ‌నార్దన్ రెడ్డి బెయిల్‌ను ర‌ద్దు చేయండి... సుప్రీంకోర్టులో సీబీఐ పిటిష‌న్‌

Cancel the Bail of Gali Janardhana Reddy
x

గాలి జ‌నార్దన్ రెడ్డి బెయిల్‌ను ర‌ద్దు చేయండి... సుప్రీంకోర్టులో సీబీఐ పిటిష‌న్‌

Highlights

*షరతులతో ఇచ్చిన బెయిల్‌ రద్దు చేయాలని పిటిషన్‌ వేసింది

Gali Janardhan Reddy: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేసింది. షరతులతో ఇచ్చిన బెయిల్‌ రద్దు చేయాలని పిటిషన్‌ వేసింది. అక్రమమైనింగ్‌ కేసులో సాక్షులను బెదిరిస్తున్నారని.. కేసును గాలి జనార్దన్‌రెడ్డి పక్కదోవ పట్టిస్తున్నారని సుప్రీంకోర్టుకు తెలిపింది. అందువల్ల ఆయనను బళ్లారి నుంచి బయటకు పంపాలని సీబీఐ.. సుప్రీంకోర్టును కోరింది. అక్రమ మైనింగ్ కేసులో ఏ-2గా ఉన్న గాలి జనార్దన్‌ రెడ్డికి.. బళ్లారిలో ఉండేందుకు అనుమతిస్తూ గతేడాది ఆగస్టు 19న సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. అయితే బళ్లారిలో ఉంటున్న గాలి జనార్దన్‌రెడ్డి సాక్షులను బెదిరిస్తున్నారని.. ప్రధాన సాక్షి శ్యామ్‌ప్రసాద్‌కు బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వచ్చాయని.. గాలి జనార్దన్‌రెడ్డి నుంచి సందేశం వచ్చిందని అఫిడవిట్‌లో తెలిపింది. రక్షణ కల్పించాలని శ్యామ్‌ సీబీఐ కోర్టును కోరినట్లు తెలిపింది. మరో సాక్షికి వచ్చిన బెదిరింపులపై పరిశీలిస్తున్నట్లు కోర్టుకి వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories