Campaign with Drone on Coronavirus: కరోనాపై డ్రోన్ తో ప్రచారం.. తమిళనాడు పోలీసులు వినూత్న నిర్ణయం

Campaign with Drone on Coronavirus: కరోనాపై డ్రోన్ తో ప్రచారం.. తమిళనాడు పోలీసులు వినూత్న నిర్ణయం
x
Drone Camera (File Photo)
Highlights

Campaign with Drone on Coronavirus: కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో ప్రజలను అప్రమత్తం చేసేందుకు పలు రాష్ట్రాలు వివిధ రకాలుగా ప్రచారాన్ని చేస్తున్నాయి.

Campaign with Drone on Coronavirus: కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో ప్రజలను అప్రమత్తం చేసేందుకు పలు రాష్ట్రాలు వివిధ రకాలుగా ప్రచారాన్ని చేస్తున్నాయి. కొన్ని చోట్ల మాస్క్ పెట్టుకోకపోతే జరిమానాలు విధిస్తుండగా, మరో చోట బయట తిరుగుతున్నవారిని క్వారెంటైన్ కు పంపుతున్నారు. దీనిలో భాగంగానే తమిళనాడు పోలీసులు డ్రోన్ తో దీనికి సంబంధించిన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇది వీధుల్లో వెళుతుంటే దీనిని చూసేందుకు అందరూ ఎగబడతారని భావించిన పోలీసులు దాని మీద ప్రత్యేక మైక్ ఏర్పాటు చేసి బయటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు చేస్తున్నారు.

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 9 లక్షలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయి. తమిళనాడులో ఇప్పటికే లక్షన్నరకు చేరువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం కరోనా కట్టడి కోసం కఠిన నిర్ణయాలు చేపడుతోంది. ఇందులో భాగంగా మదురై పోలీసులు ప్రజల్లో కరోనా పట్ల అవగాహన రావడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా డ్రోన్ల సహాయంతో కరోనా అలర్ట్‌ గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు. డ్రోన్లకు స్పీకర్లు పెట్టి.. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు.. నిబంధనలను తెలియజేస్తున్నారు. ప్రజలు ఎవరు కూడా అనవసరగంగా బయటకు రావొద్దని.. కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని సూచిస్తున్నారు. కాగా, దేశంలో రోజు నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో తమిళనాడు నుంచి కూడా అత్యధికంగా నమోదవుతున్నాయి. గత మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో నాలుగు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు కూడా భయంతో వణికిపోతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories