Kangana Ranaut: 'నువ్వు మౌనంగా ఎందుకున్నావు..?' కంగనా-హన్సల్ మెహతా మధ్య మాటల యుద్ధం!

Kangana Ranaut
x

Kangana Ranaut: 'నువ్వు మౌనంగా ఎందుకున్నావు..?' కంగనా-హన్సల్ మెహతా మధ్య మాటల యుద్ధం!

Highlights

Kangana Ranaut: అధికారుల నుంచి రాత్రి నోటీసు వచ్చిందని, ఉదయమే కోర్టులు తెరచేలోపు బుల్డోజర్లు తన ఆస్తిపైకి వచ్చి పూర్తిగా ధ్వంసం చేశాయని ఆరోపించింది.

Kangana Ranaut: బాలీవుడ్ నటి కంగనా రనౌత్, దర్శకుడు హన్సల్ మెహతా మధ్య సోషల్ మీడియాలో ఘర్షణ ముదిరింది. తాజాగా కమెడియన్ కునాల్ కామ్రా షోకు సంబంధించి షిండే శివసేన వర్గీయులు ఓ స్థలాన్ని ధ్వంసం చేయడంతో ముంబై మున్సిపల్‌ చర్యలు తీవ్ర దుమారానికి దారి తీశాయి. ఈ నేపథ్యంలో హన్సల్ మెహతా కామ్రా పక్షాన మద్దతుగా స్పందించాడు. దీంతో ఒక యూజర్ కంగనాకు గతంలో జరిగిన విధ్వంసాన్ని గుర్తు చేస్తూ ఆయన మౌనాన్ని ప్రశ్నించాడు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన హన్సల్ మెహతా, కంగనాకు న్యాయం జరిగిందా అనే సందేహం వ్యక్తం చేశాడు. అతని అభిప్రాయాన్ని చూసిన కంగనా, గతంలో తన ఆఫీసు ఎలా కూల్చివేశారో వివరంగా గుర్తుచేసింది. అధికారుల నుంచి రాత్రి నోటీసు వచ్చిందని, ఉదయమే కోర్టులు తెరచేలోపు బుల్డోజర్లు తన ఆస్తిపైకి వచ్చి పూర్తిగా ధ్వంసం చేశాయని ఆరోపించింది. ఈ చర్యపై హైకోర్టు కూడా అక్రమంగా ఉందని తేల్చిందని గుర్తుచేసింది.

కంగనా, తనకు అప్పట్లో మద్దతుగా నిలబడకపోయిన హన్సల్ ఇప్పుడు అభిప్రాయాలు వ్యక్తం చేయడం మానుకోవాలని చెప్పింది. తాను అనుభవించిన దుఃఖాన్ని, మానసిక వేధింపులను హన్సల్ సమాజంలో తనకు తెలియనట్లుగా ప్రవర్తించడం పట్ల ఆమె తీవ్రంగా వ్యతిరేకించింది. తన జీవిత సంఘటనలపై అసత్య వ్యాఖ్యలు చేయడం అసహనానికి గురిచేసిందని ఆమె పేర్కొంది. ఇటీవల కంగనా రాజకీయ నాయకురాలిగా మారిన తరువాత కూడా తన పాత సంఘటనలపై ఇలా స్పందించడమే కాకుండా, సెల్ఫ్‌ రెస్పాక్ట్ కాపాడుకోవడంలో వెనుకాడటం లేదని ఈ ఘటన వెల్లడిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories