అల్లర్లతో అట్టుడికిన ఢిల్లీ.. అసలేం జరుగుతోంది?

అల్లర్లతో అట్టుడికిన ఢిల్లీ.. అసలేం జరుగుతోంది?
x
Delhi Caa Protests
Highlights

ఈశాన్య దిల్లీలోని జఫ్రాబాద్‌, మౌజ్‌పుర్‌, గోలక్‌పురి భజన్‌పురలో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాలు రాళ్లు రువ్వుకున్నారు.

ఢిల్లీలోని సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య మరోసారి చోటు చేసుకున్న ఘర్షణ హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో రతన్‌ లాల్‌ అనే దిల్లీ పోలీస్‌ రతన్‌లాల్‌ అనే కానిస్టేబుల్‌ తలకు రాయి తగలడంతో మృతిచెందారు. డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ అమిత్ శర్మకు గాయాలయ్యాయి. తల, చేతి భాగాల్లో గాయాలు కావడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. మరికొందరు పోలీసులు ఘర్షణలో గాయపడ్డారు. సోమవారం రాత్రి వరకు నలుగురు మృతి చెందారు. మొదట నిరసనకారులు స్థానిక ఇళ్లకు, వాహనాలకు నిప్పు పెట్టడంతో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. ఇరువర్గాల ఘర్షణలో పోలీసులు 10 మంది గాయపడ్డారు.

ఈశాన్య దిల్లీలోని జఫ్రాబాద్‌, మౌజ్‌పుర్‌, గోలక్‌పురి భజన్‌పురలో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. స్వల్ప లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో పలు వాహనాలు, దుకాణాలు, ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఓ ఫైరింజన్‌ సైతం ధ్వంసమైంది. ఆందోళన నేపథ్యంలో దిల్లీలోని జఫ్రాబాద్‌, మౌజ్‌పుర్‌-బాబర్‌ పుర్‌ మెట్రో స్టేషన్లను మెట్రో అధికారులు మూసివేశారు. 24 గంటల పాటు జఫ్రాబాద్‌ మెట్రో స్టేషన్‌ను మూసివేస్తున్నట్లు దిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ తెలిపింది. పేర్కొంది. నిన్న జఫ్రాబాద్‌ ప్రాంతంలో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) బిల్లను వ్యతిరేకంగా కొద్ది రోజులుగా జఫ్రాబాద్, మౌజ్‌పూర్, షహీన్‌బాగ్ వంటి ప్రాంతాల్లో ఆందోళనకారులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 500 మంది ఆందోళనకారులు షాహీన్‌బాగ్ తరహాలోనే జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌ సమీపంలో శనివారం అర్ధరాత్రి నుంచి నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. దీనిపై మాజీ బీజేపీ నేత కపిల్ మిశ్రా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆందోళనకారులను వెంటనే అక్కడి నుంచి ఖాళీ పోలీసులను ఆదేశించారు. సీఏఏకు అనుకూలంగా అదే ప్రాంతంలో కపిల్ మిశ్రా ఆదివారం బైటాయించారు. జాఫ్రాబాగ్ నుంచి ఆందోళనకారులను పంపించాలని, పోలీసులకు మూడు రోజులు గడువు ఇస్తున్నామని సోషల్ మీడియాలో కపిల్ మిశ్రా జారీ చేశారు.

జాఫ్రాబాద్, చాంద్ బాగ్ రోడ్లను పోలీసులు ఖాళీ చేయించపోతే పరిణామాలు వేరేగా ఉంటాయని హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు వచ్చి వెళ్లే వరకు గొడవలు లేకుండా ఖాళీ చేయాలని, నిరసనకారులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయకపోతే తాము పోలీసుల చెప్పిన వినబోమని వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో ఆందోళకారును పోలీసులు చెదరగొట్టడానికి పలు దఫాలుగా ప్రయత్నించారు. అయితే ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆందోళనకారులపై ఒక్కసారిగా రాళ్లు రువ్వినట్లు తెలుస్తోంది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జీ ఆందోళనకారులపై టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. సాయంత్రానికి పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది. సోమవారం మళ్లీ సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాలకు చెందిన వారి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆందోళనకారుల చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. ఈ నేపథ్యంలో ఓ కానిస్టేబుల్ సహా నలుగురు దుర్మరణం చెందారు. మరో 50 మంది గాయడినట్లు తెలుస్తొంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories