జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల చర్యకు సంబంధించి కీలక వీడియో

జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల చర్యకు సంబంధించి కీలక వీడియో
x
Highlights

జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల చర్యకు సంబంధించి మరో సీసీ టీవీ వీడియో బయటకు వచ్చింది. విద్యార్థి సంఘం నాయకులు ఈ వీడియోను శనివారం విడుదల చేశారు.

జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల చర్యకు సంబంధించి మరో సీసీ టీవీ వీడియో బయటకు వచ్చింది. విద్యార్థి సంఘం నాయకులు ఈ వీడియోను శనివారం విడుదల చేశారు. 49 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో.. జామియా విశ్వవిద్యాలయం యొక్క లైబ్రరీలో చదువుతున్న విద్యార్థులను చాలా మందిని పోలీసులు కర్రలతో కొడుతున్నట్లు ఈ రెండు నెలల పాత వీడియో ఫుటేజీలో స్పష్టంగా చూడవచ్చు. మరోవైపు, జామియా విశ్వవిద్యాలయం లైబ్రరీలో లాఠీ ఛార్జ్ పై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

వీడియో వెలువడిన తరువాత, స్పెషల్ కమిషనర్ (క్రైమ్) ప్రవీర్ రంజన్ మాట్లాడుతూ - ప్రస్తుతం వైరల్ అవుతున్న జామియా మిల్లియా విశ్వవిద్యాలయం (లైబ్రరీ) యొక్క తాజా వీడియో తమ దృష్టికి వచ్చిందని.. దానిపై దర్యాప్తు చేస్తాము అని తెలిపారు. కాగా జామియా కార్డినేసన్ కమిటీ సోషల్ మీడియాలో విడుదల చేసిన ఈ 49 సెకన్ల వీడియోలో, విద్యార్థులు విశ్వవిద్యాలయంలోని ఓల్డ్ రీడింగ్ హాల్ (ఎం.ఫిల్ విభాగం) లో కూర్చున్నట్లు కనిపిస్తుంది. పోలీసులు రాకముందు, ఒక వ్యక్తి డెస్క్ కింద దాక్కున్నట్లు కనిపిస్తుండగా, మరొకరు తొందరలో లేవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది.

పోలీసులు కారులోకి ప్రవేశించి విద్యార్థులను లాఠీ ఛార్జి చేయడం వీడియోలో కనిపిస్తుంది. పోలీసులు వారిపై కర్రలతో కొడుతున్న సమయంలో కొంతమంది విద్యార్థులు అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఈ వీడియో వెలువడిన తరువాత పోలీసులు అబద్ధాలు చెప్పారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ వీడియోలో కనిపించే పోలీసులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత శశి థరూర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు: "జామియా విద్యార్థులను ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండానే కొట్టారని సిసిటివి ఫుటేజ్ స్పష్టంగా చూపిస్తుంది. ఇది గగుర్పాటు. అలాంటి పోలీసులను కఠినంగా శిక్షించాలి. " అని పేర్కొన్నారు.

డిసెంబర్ 15 న జామియా విశ్వవిద్యాలయంలో హింసాకాండ చెలరేగింది, పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా విశ్వవిద్యాలయ విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు.. ఈ క్రమంలో హింస చెలరేగింది. దీన్ని ఆపడానికి పోలీసులు టియర్ గ్యాస్ మరియు కర్రలను ఉపయోగించారు. ఈ గతంలో వంద మందికి పైగా విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories