Lionel Messi India tour: ఇవాళ్టితో ముగిసిన మెస్సీ భారత పర్యటన.. మోడీతో భేటీ, ఎగ్జిబిషన్ మ్యాచ్

ఇవాళ్టితో ముగిసిన మెస్సీ భారత పర్యటన.. మోడీతో భేటీ, ఎగ్జిబిషన్ మ్యాచ్
x

ఇవాళ్టితో ముగిసిన మెస్సీ భారత పర్యటన.. మోడీతో భేటీ, ఎగ్జిబిషన్ మ్యాచ్

Highlights

ఇవాళ్టితో మెస్సీ భారత పర్యటన ముగింపు ఢిల్లీలో ప్రధాని మోడీతో మెస్సీ కీలక భేటీ అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్న మెస్సీ రాత్రికి ఇండియా నుంచి బయల్దేరి వెళ‌్లనున్న మెస్సీ

ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ "గోట్ టూర్" లో భాగంగా జరుగుతున్న భారత పర్యటన ఇవాళ్టితో ముగియనుంది. పర్యటనలో భాగంగా మెస్సీ ఇవాళ ఢిల్లీలో పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మొదట ఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్‌లో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో అభిమానులు, ప్రముఖులతో సమావేశమవుతారు. అనంతరం ప్రధాని మోడీతో మెస్సీ మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు.


ప్రధానితో భేటీ తర్వాత మెస్సీ జాతీయ ఫుట్‌బాల్ సంఘం మాజీ చీఫ్ ప్రఫుల్ పటేల్ నివాసానికి వెళ్లనున్నారు. అక్కడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిని కలుస్తారు. సాయంత్రం అరుణ్‌జైట్లీ స్టేడియంలో మెస్సీ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ మ్యాచ్‌లో సినీ, క్రీడా రంగాల ప్రముఖులు పాల్గొని మెస్సీతో కలిసి ఆడనున్నారు. రాత్రికి మెస్సీ భారత్ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories