రాజస్థాన్ ‎ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన భీమ్.. ధర ఎంతో తెలుసా?

రాజస్థాన్ ‎ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన భీమ్.. ధర ఎంతో తెలుసా?
x
Highlights

రాజస్థాన్‌లో ప్రపంచ ప్రసిద్ధి పుష్కర్ ఫెయిర్‌లో ముర్రా జాతీకి చెందిన ఓ గేద ఆకర్షణగా నిలించింది. అజ్మీర్ నగరంలో ఈ కార్యక్రమాలు అట్టహాసంగా...

రాజస్థాన్‌లో ప్రపంచ ప్రసిద్ధి పుష్కర్ ఫెయిర్‌లో ముర్రా జాతీకి చెందిన ఓ గేద ఆకర్షణగా నిలించింది. అజ్మీర్ నగరంలో ఈ కార్యక్రమాలు అట్టహాసంగా ప్రారంభమైయ్యాయి. జానపద గీతాలు, నృత్యాలతో పాటు సంస్కృతిక, పూజా కార్యక్రమాలు అందరిని ఆకటుకున్నాయి. ఇందులో భాగంగా సుమారు 13వందల కిలోల బరువు,14కోట్లు విలువైన ముర్రా జాతీకి చెందిన భీమ్ అందరి దృష్టిని ఆకర్షించింది.

నవంబర్ 4న ప్రారంభమైన పుష్కర్ ఫెయిర్ ఇక్కడి ప్రజలు ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగలో వివిధ జాతులకు చెందిన 5,000 జంతువులను తీసుకొచ్చారు. ఈ ఉత్సవాలకు‎ వేలాదిగా అంతర్జాతీయ పర్యాటకులు వస్తారు. రాజస్థాన్ యొక్క సాంస్కృతిక సౌందర్యాన్ని చూడటానికి సందర్శకులు ఎక్కువగా వస్తారు. ప్రతి ఏటా నవంబర్‌లో నిర్వహించే ఈ పుష్కర ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ సందర్భంగా పుష్కర్ ప్రాంతం మొత్తం అద్భుతంగా తీర్చిదిద్దుతారు. పర్యాటకులు వేల కొద్దీ పుష్కర్ సరస్సులో స్నానాలు ఆచరిస్తారు. అక్కడ ఉన్న బ్రహ్మ దేవుని ఆలయాన్ని‎దర్శించుకుంటారు. పశువుల పెంపకందారులు, రైతులు, ఒంటెల వ్యాపారులు కలిసి పశువులు, ఒంటెల అమ్మకాలు, కొనుగోళ్లను చేసే అతి పెద్ద పండుగ ఇది. ఈ జంతుప్రదర్శనకు అన్ని మేలి రకాల జాతీకి చెందిన పశువులను తీసుకొచ్చారు.

అయితే వాటిలో భీమ్ అనే గేదేను జోధ్పూర్ కు చెందిన జంగీద్ సొంతం చేసుకున్నారు. గత సంవత్సరం ఈ భీమ్ 12వందల కిలోల బరువు, 12 కోట్లు పలికింది.భీమ్ ఆహారానికి నెలకు లక్షన్నర రూపాయిలు ఖర్చు అవుతుందని దాని యాజమాని జవహర్ లాల్ జాంగీద్ కుమారుడు అరవింద్ జంగీద్ తెలిపారు. రోజు కిలో నెయ్యి, అర కిలో వెన్నె, 25 లీటర్లు పాలు, జీడిపప్పు, బాదంపప్పు వంటివి దానికి ఆహారంగా పెడతామని జంగీద్ వెల్లడించారు.

ఈ ఉత్సవానికి వచ్చే ముందు ఈ‎ భీమ్ కొనుగోలు చేస్తామని దాని కోసం 14 కోట్ల రూపాయిలు ఇస్తామని కొందరు వచ్చారన్నారు. అయినప్పటికి దానిని అమ్మడానికి మేము ఒప్పకోలేదని తెలిపారు. ముర్రా జాతీకి చెందిన గేదలను సంరక్షించానే సందేశాన్ని ఇవ్వడానికి తాము భీమ్ ను ఈ ఉత్సవానికి తీసుకొచ్చామని జంగీద్ చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories