Coronavirus: బీఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యాలయం మూసివేత

Coronavirus: బీఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యాలయం మూసివేత
x
BSF Head Office
Highlights

ఢిల్లీలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేసుల సంఖ్య 4,549 గా ఉంది.

ఢిల్లీలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేసుల సంఖ్య 4,549 గా ఉంది.ఇందులో 1362 మంది కోలుకోగా.. 64 మంది మృతి చెందారు. అయితే రోజురోజుకు ఢిల్లీలో కేసులు పెరుగుతుండడంతో బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్‌) ప్రధాన కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఉన్న ప్రధాన కార్యాలయంలోని రెండు అంతస్తులకు బీఎస్‌ఎఫ్‌ అధికారులు సోమవారం సీల్ వేశారు. ఇటీవల కొంతమంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు బీఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారులు.

కాగా ఢిల్లీలోని లోధి రహదారిలో ఉన్న సీజీఓ కాంప్లెక్స్‌లో మొత్తం ఎనిమిది అంతస్తులు భవనంగా బీఎస్‌ఎఫ్ ప్రధాన కార్యాలయం కార్యాలయం ఉంది. ప్రస్తుతం‌ భవనంలో అన్ని గదులకు శానిటైజేషన్‌ పనులు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు కరోనా పాజిటివ్‌ వచ్చిన సిబ్బందితో ఎవరెవరు కాంటాక్టు అయ్యారో వారి వివరాలను సేకరిస్తున్నట్టు తెలిపారు.

ఇదిలావుంటే ఢిల్లీలో అతిపెద్ద సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌) బెటాలియన్ లో కూడా కూడా కరోనా కలకలం రేగింది. ఇక్కడ 132 మందికి పైగా సీఆర్‌పీఎఫ్ ట్రూపర్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో వారిని క్వారంటైన్ కు తరలించారు.. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా 400 మందికి పైగా సిబ్బందిని క్వారంటైన్ కు తరలించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories