TOP 6 News @ 6PM: 'రేవంత్ కు అంత మెజారిటీ వస్తే రాజకీయ సన్యాసం'

BRS Working President KTR challenges to Revanth Reddy and AP Speaker satirical Comments on YS Jagan
x

రేవంత్‌కు 50 వేల మెజారిటీ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న కేటీఆర్

Highlights

చంద్రబాబుకు ఇచ్చినంత సమయం తనకూ ఇవ్వాలని జగన్ ఏ రూల్ ప్రకారం అడుగుతున్నరని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు

1.జగన్ కు ఏ రూల్స్ ప్రకారం సమయం ఇవ్వాలి: ఏపీ అసెంబ్లీ స్పీకర్

చంద్రబాబుకు ఇచ్చినంత సమయం తనకూ ఇవ్వాలని జగన్ ఏ రూల్ ప్రకారం అడుగుతున్నరని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ఏ రూల్ ప్రకారం ఇంత సమయం ఇవ్వాలో చెప్పాలని ఆయన కోరారు.సోమవారం మధ్యాహ్నం లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాతో బేటీ తర్వాత ఆయన న్యూదిల్లీలో మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రతిపక్షనాయకుడు కాదు.. ఆ హోదాకు తగిన సంఖ్యాబలం కూడా లేదని ఆయన గుర్తు చేశారు.

2.రేవంత్ రెడ్డికి అంత మెజారిటీ వస్తే రాజకీయ సన్యాసం: కేటీఆర్

రేవంత్ రెడ్డికి 50 వేల కంటే ఎక్కువ ఓట్ల కంటే ఎక్కువ మెజారిటీతో గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. సోమవారం కొడంగల్ లో నిర్వహించిన రైతు దీక్షలో ఆయన మాట్లాడారు. కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొడంగల్ లో యుద్ధం నడుస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయలేదన్నారు.

3.అమెరికా బాటలోనే వలసలకు చెక్ పెడుతున్న యూకే

అక్రమంగా తమ దేశంలోకి వచ్చిన 600 మందిని యునైటెడ్ కింగ్ డమ్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ ఈ విషయమై స్పందించారు. అక్రమ వలసలకు ముగింపు పలుకుతామని ఆయన అన్నారు. తమ దేశంలోకి అక్రమంగా వలస రావడంతో పాటు పనిచేస్తున్నారని ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. స్మార్టర్ ప్రభుత్వం సరిహద్దు సెక్యూరిటీపై ఫోకస్ పెట్టింది. అక్రమంగా వలస వస్తున్న వారిని కంట్రోల్ చేస్తోంది. స్టోర్లు, బార్లు, రెస్టారెంట్లలో పనిచేస్తున్న అక్రమ వలసదారులను అరెస్ట్ చేశారు. అమెరికా బాటలోనే యుకె సాగుతోంది. అమెరికాలో సరైన పత్రాలు లేకుండా ఉన్న వలసదారులను స్వదేశాలకు పంపుతోంది. గత వారంలో అమెరికా నుంచి వంద మందికి పైగా భారతీయులను అమెరికా తిరిగి పంపింది.

4.క్రిమినల్ కేసులంటే ప్రజాప్రతినిధులుగా ఎలా అర్హులు: సుప్రీంకోర్టు

క్రిమినల్ కేసులుంటేనే ఉద్యోగంలో చేరేందుకు అనర్హులని.. అలాంటిది ప్రజా ప్రతినిధులగా ఎలా అర్హులు అవుతారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసులపై సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. క్రిమినల్ కేసుల్లోదోషులుగా తేలినవారిని పోటీ చేయకుండా జీవితకాలం నిషేధం విధించాలని ఆశ్విని ఉపాధ్యాయ్ 2016లో పిల్ పై సుప్రీంకోర్టు విచారించింది.

42 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులున్నాయి. కొన్ని చోట్ల ప్రజా ప్రతినిధులపై 30 ఏళ్లుగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని అమికస్ క్యూరీ తన నివేదికలో తెలిపారు. దేశంలో చాలా చోట్ల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు కూడా లేని విషయాన్ని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించింది.

5. చిలుకూరు టెంపుల్ అర్చకుడు రంగరాజన్ పై దాడి కేసులో వీర రాఘవరెడ్డి అరెస్ట్

చిలుకూరు టెంపుల్ అర్చకుడు రంగరాజన్ పై దాడి కేసులో వీరరాఘవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రంగరాజన్ పై దాడి చేసి వీరరాఘవరెడ్డి పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రామరాజ్యం వీర రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు. వీరరాఘవరెడ్డితో పాటు మరొకరిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

6.కిరణ్ రాయల్‌పై ఆరోపణలు చేసిన లక్ష్మి అరెస్ట్

కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మిని రాజస్థాన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఆన్ లైన్ ఛీటింగ్ కేసులో లక్ష్మిపై ఆరోపణలున్నాయి. ఇదే కేసులో ఆమెను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ నుంచి వస్తున్న సమయంలో ఆమెను అరెస్ట్ చేశారు.లక్ష్మిని ఎస్ వీ యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఆర్ధిక లావాదేవీలు, ఇతర వివాదాలపై కిరణ్ రాయల్ పై లక్ష్మీ ఆరోపణలు చేశారు.తన పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నానని చెప్పారు. కిరణ్ రాయల్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆమె ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories