BRS Aurangabad: టార్గెట్ మహారాష్ట్ర.. నేడు ఔరంగాబాద్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ..

CM KCR To Attend BRS Public Meeting In Aurangabad Today
x

BRS Aurangabad: టార్గెట్ మహారాష్ట్ర.. నేడు ఔరంగాబాద్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ..

Highlights

BRS Aurangabad: టార్గెట్ మహారాష్ట్ర.. నేడు ఔరంగాబాద్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ..

BRS Aurangabad: మహారాష్ట్రలో బీఆర్ఎస్‌ను విస్తరించేందుకు గులాబీ బాస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే.. ఇవాళ ఔరంగాబాద్‌లో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఔరంగాబాద్‌లోని ఛత్రపతి శంభాజీనగర్ జబిందా మైదానం ముస్తాబైంది. తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్‌ అమలుచేస్తున్న ప్రభుత్వ పథకాలను వివరిస్తూ పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న సభకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.

బీఆర్ఎస్‌ తరఫున మహారాష్ట్రలో ఇప్పటిదాకా నాందేడ్, కందహార్‌లో నిర్వహించిన బహిరంగ సభలు విజయవంతం కావడంతో ఔరంగాబాద్‌లో మూడో సభ నిర్వహిస్తున్నారు. ఔరంగాబాద్ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు ఇటీవల బీఆర్ఎస్‌లో చేరారు. తాజాగా నిర్వహిస్తున్న సభలో కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్‌కు అడుగడుగునా స్వాగతం పలుకుతూ... భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. బహిరంగ సభ ఏర్పాట్లతో శంభాజీనగర్ కొత్తదనాన్ని సంతరించుకుంది. అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో పార్టీ విస్తరణ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్తును ఇస్తున్నప్పుడు మహారాష్ట్రలో ఎందుకివ్వరనే ప్రశ్నలతో ఫ్లెక్సీలు వేశారు. ప్రభుత్వ పథకాల అమల్లో తెలంగాణ కొత్త అడుగులు వేస్తోందని శంభాజీ నగర్‌లో ఏర్పాట్లు అద్ధంపడుతున్నాయి.

ప్రతి ఎకరానికి సాగునీరు ఇస్తున్నపుడు.. మహారాష్ట్ర ఎందుకు ఇవ్వదు? ఇంటింటికి నల్లాతో స్వచ్చమైన తాగునీరు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నప్పుడు, మహారాష్ట్ర పభుత్వం ఎందుకివ్వటం లేదు? పేదింటి ఆడపిల్లల పెళ్లికానుకగా ఇచ్చే కళ్యాణ లక్ష్మీ పథకం ఎందుకు అమలు చేయడంలేదు? రైతుబంధు పథకాన్ని అమలు చేస్తూ.. వ్యవసాయాభివృద్ధికి, రైతుల సంక్షేమంకోసం శ్రమిస్తుంటే... మహారాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఖాతరు చేయడంలేదని ఫ్లెక్సీలు ఏర్పాట్లుచేశారు. ఈ ఫ్లెక్సీలు అ మూడు రోజులుగా లోక్ మహారాష్ట్ర ప్రజానీకానికి అర్థమయ్యే విధంగా... ఎన్నికల మ్యానిఫెస్టోను కేసీఆర్ ఔరంగా బాద్ సభలో వెల్లడించబోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories