Debbie Abrahams: బ్రిటిష్ ఎంపీని ఎయిర్ పోర్ట్ నుండే వెనక్కిపంపిన భారత్

Debbie Abrahams: బ్రిటిష్ ఎంపీని ఎయిర్ పోర్ట్ నుండే వెనక్కిపంపిన భారత్
x
Highlights

జమ్మూ కాశ్మీర్‌పై మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను తీవ్రంగా తప్పుబట్టడమే కాకుండా మోదీని తూర్పారబత్తిన బ్రిటిష్ ఎంపి డెబ్బీ అబ్రహామ్స్ కు ఢిల్లీ ఎయిర్...

జమ్మూ కాశ్మీర్‌పై మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను తీవ్రంగా తప్పుబట్టడమే కాకుండా మోదీని తూర్పారబత్తిన బ్రిటిష్ ఎంపి డెబ్బీ అబ్రహామ్స్ కు ఢిల్లీ ఎయిర్ పోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమెను భారత్ లోకి అడుగుపెట్టనీయలేదు. "భారత వ్యతిరేక చర్యలలో పాల్గొన్నందున" ఆమెను దేశంలోకి అనుమతించలేదు. భారత్ కు రాకుండా ఆమె వీసాను నిరాకరించారు, దీంతో ఈ సంఘటన వివాదానికి దారితీసిన ఒక రోజు తర్వాత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాన్ని తప్పుబట్టింది.

స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను సందర్శించడానికి ఎమిరేట్స్ విమానంలో డెబ్బీ అబ్రహామ్స్ సోమవారం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే ఆమెను ఎయిర్ పోర్టు నుండే బహిష్కరించారు. ఆమె ఇ-వీసా రద్దు చేయబడిందని.. ఈ విషయం డెబ్బీ అబ్రహామ్స్‌కు ముందే సమాచారం ఇచ్చినట్లు సోమవారం హోంశాఖ తెలిపింది. ఫిబ్రవరి 14 నుండే వీసా రద్దు గురించి ఆమెకు సమాచారం అందిందని ప్రభుత్వ వర్గాలు మంగళవారం పునరుద్ఘాటించాయి.

వీసా లేదా ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ మంజూరు చేయడం, తిరస్కరించడం లేదా ఉపసంహరించుకోవడం ఒక దేశం యొక్క సార్వభౌమ హక్కు అని, వర్గాలు తెలిపాయి, బ్రిటిష్ చట్టసభ సభ్యురాలు అయిన డెబ్బీ అబ్రహాంస్‌కు వ్యాపార సమావేశాలకు హాజరయ్యేందుకు గత ఏడాది అక్టోబర్ 7 న ఇ-బిజినెస్ వీసా జారీ చేయబడింది, ఇది 2020 అక్టోబర్ 5 వరకు చెల్లుతుంది.. అయితే అనూహ్యంగా "ఫిబ్రవరి 14, 2020 న ఆమె ఇ-బిజినెస్ వీసా రద్దు చేశారు.

భారతదేశ జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొనడం వలన ఆమెకు వీసా రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. అంతేకాదు ఇ-బిజినెస్ వీసాను తిరస్కరించినట్టు ఫిబ్రవరి 14న ఆమెకు తెలియజేసినట్టు స్పష్టం చేశారు. కాశ్మీర్‌పై బ్రిటిష్ పార్లమెంటరీ బృందానికి అధ్యక్షత వహించిన అబ్రహం సోమవారం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు.. అయినా ఆమెను భారతదేశంలోకి ప్రవేశించడాన్ని నిరాకరించారు.

లేబర్ పార్టీ ఎంపిగా ఉన్న డెబ్బీ అబ్రహామ్స్ వీసా నిరాకరణపై మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.. వీసా రద్దుపై ప్రశ్నలు సంధించారు. ఒక ట్వీట్‌లో ' వీసా ఎందుకు నిరాకరించారు & దీనిపై స్పష్టత కోసం నేను PRO మానవ హక్కులు మరియు సామాజిక న్యాయ ప్రతినిధులను ఆశ్రయిస్తాను.. హక్కులు లేని వ్యక్తుల గురించి నేను ఎల్లప్పుడూ మాట్లాడతాను ' అని పేర్కొన్నారు. అలాగే ఇమ్మిగ్రేషన్ డెస్క్ వద్ద తన పత్రాలు మరియు ఇ-వీసా ను సమర్పించినట్లు అబ్రహం తన ప్రకటనలో తెలిపారు.

తరువాత అనేక మంది ఇమ్మిగ్రేషన్ అధికారులు తన వద్దకు వచ్చారని, అయితే తన ఇ-వీసా ఎందుకు రద్దు చేయబడిందో వారిలో ఎవరికీ కూడా తెలియదని ఆమె అన్నారు. బాధ్యత వహిస్తున్న వ్యక్తి కూడా తనకు తెలియదని క్షమించండి అని చెప్పాడని చెప్పారు. ఇదిలావుంటే అబ్రహం బహిష్కరణ పై స్పందించిన కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ కాశ్మీర్‌లో పరిస్థితి సాధారణమని చెప్పుకుంటే ప్రభుత్వం విమర్శకులను ఎందుకు భయపెడుతోందని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories