బిహార్‌లో పేలిన ఇటుక బట్టీ చిమ్నీ.. 9 మంది మృతి, 10 మందికి పైగా గాయాలు

Brick Kiln Explosion in Ramgarhwa Bihar
x

బిహార్‌లో పేలిన ఇటుక బట్టీ చిమ్నీ.. 9 మంది మృతి, 10 మందికి పైగా గాయాలు

Highlights

* తూర్పు చంపారణ్ జిల్లా నారీగిర్ గ్రామంలో ఘటన.. ఘటనపై ప్రధాని మోదీ, సీఎం నితీశ్‌కుమార్ దిగ్భ్రాంతి

Bihar: బిహార్‌లో ఇటుక బట్టీ చిమ్నీ పేలిన ఘటనలో 8 మంది మృతి చెందారు. మరో పదిమందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఘటనపై ప్రధాని మోదీ, బిహార్‌ సీఎం నీతీశ్‌కుమార్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తూర్పు చంపారణ్‌ జిల్లాలోని నారీగిర్‌ గ్రామంలో ఓ ఇటుక బట్టీకి చెందిన ఎత్తయిన చిమ్నీ పేలిపోయింది. ఈ దుర్ఘటనలో 8 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి.

క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి తీవ్ర గాయాలు, ఊపిరాడని పరిస్థితుల్లో కార్మికులు మృతి చెందారని అధికారులు వెల్లడించారు. ఇటుక బట్టీ యజమాని సైతం ఈ ప్రమాదంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.రెండు లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories